డేటింగ్ యాప్ ఉచ్చులో బ్యాంక్ మేనేజర్
ABN , First Publish Date - 2022-06-25T08:36:03+05:30 IST
ఆన్లైన్లో పరిచయమైన యువతి వలలో చిక్కి బెంగళూరులో ఇండియన్ బ్యాంకు మేనేజర్ హరిశంకర్ ఆమెకు రూ.5.70 కోట్లు ముట్టజెప్పి అరెస్టయ్యాడు.
యువతి ఖాతాకు రూ.5.70 కోట్ల బదిలీ
బెంగళూరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్లో పరిచయమైన యువతి వలలో చిక్కి బెంగళూరులో ఇండియన్ బ్యాంకు మేనేజర్ హరిశంకర్ ఆమెకు రూ.5.70 కోట్లు ముట్టజెప్పి అరెస్టయ్యాడు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఆ యువతి అత్యవసరంగా డబ్బులు కావాలనడంతో తన వద్ద ఉన్న రూ.12 లక్షలతో పాటు తన బ్యాంకులో ఒక ఖాతాదారు డిపాజిట్ నుంచి రూ.5.70 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ చేశాడు.