BOB ఖాతాదారులకు GOODNEWS

ABN , First Publish Date - 2022-06-19T00:33:39+05:30 IST

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్స్‌ బ్యాంక్‌..

BOB ఖాతాదారులకు GOODNEWS

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్ బరోడా (BOB) తమ ఖాతాదారులకు శుభవార్త (GOODNEWS) చెప్పింది. సేవింగ్స్‌ బ్యాంక్‌ (Savings Bank) అకౌంట్లపై వడ్డీ రేట్లు (Intrest rates) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్‌ అకౌంట్లపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించింది.


 కాగా లక్ష రూపాయల వరకు బ్యాంక్ బ్యాలెన్స్‌ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై 2.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది బీవోబీ... దీంతోపాటు లక్ష రూపాయల నుంచి 100 కోట్ల వరకు బ్యాలెన్స్‌ ఉన్న అకౌంట్లకు కూడా ఇదే వడ్డీ వర్తిస్తుంది. అయితే 100 కోట్ల నుంచి 200 కోట్ల లోపు సేవింగ్స్‌ బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన అకౌంట్లపై వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంటుంది. అలాగే 200 కోట్ల నుంచి 500 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన ఖాతాలపై వడ్డీ రేటు 3.05 శాతంగా కొనసాగుతోంది. అలాగే 500 కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఉన్న సేవింగ్స్‌ ఖాతాలపై 3.35 శాతం వడ్డీ అందిస్తోంది. దీంతోపాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచింది. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలకు ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుంది.


కాగా, జూన్ 16 నుంచి పెంపు నిర్ణయం అమలులోకి వచ్చింది. సాధారణ కస్టమర్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.8 శాతం నుంచి 5.35 శాతంగా ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 3.3 శాతం నుంచి 6.35 శాతంగా ఉంది. అయితే 7 రోజుల నుంచి పదేళ్ల కాల పరిమితితో డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు.

Updated Date - 2022-06-19T00:33:39+05:30 IST