సెలవు రోజుల్లో కూడా SBI సేవలు

ABN , First Publish Date - 2022-06-28T02:09:31+05:30 IST

ఖాతాదారులకు అంతరాయాల్లేకుండా సేవలనందించే క్రమంలో... SBI ఇటీవల రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

సెలవు రోజుల్లో కూడా SBI సేవలు

హైదరాబాద్ : ఖాతాదారులకు అంతరాయాల్లేకుండా సేవలనందించే క్రమంలో... SBI ఇటీవల రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటి ద్వారా కస్టమర్లకు అన్ని రకాల సేవలను అందిస్తామని బ్యాంక్ ప్రకటించింది. SBI కస్టమర్‌లు ఇకపై ఆదివారం కూడా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఈ క్రమంలోనే... SBI ప్రారంభించిన కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లు 1800 1234, 1800 2100. నిన్న(జూన్‌ 26 న, ఆదివారం) SBI ఓ ట్వీట్‌లో.. ‘బ్యాంకింగ్ సమస్యలకు వీడ్కోలు చెప్పండి. SBI  కాంటాక్ట్ సెంటర్‌(1800 1234, లేదా... 1800 2100 టోల్‌ఫ్రీ నంబర్లకు)కు కాల్ చేయండి’ అని పేర్కొంది.


ఈ క్రమంలో... SBI కస్టమర్‌లు ఈ నంబర్‌లకు ఏ సమయంలోనైనా ఎక్కడి నుంచైనా డయల్ చేయవచ్చు. వెబ్‌సైట్ లేదా యాప్ సేవలను ఉపయోగించలేని వారికి, డిజిటల్‌ సేవలపై అవగాహన లేని వారికి టోల్‌ఫ్రీ నంబర్‌లు ఉపయోగపడతాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా... ఈ నంబర్ల ద్వారా... సేవలు 24×7 అందుబాటులో ఉంటాయి. అంటే కస్టమర్లు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా SBI బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. కస్టమర్‌లు తమ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా  తెలుసుకోవచ్చు. అదే విధంగా చివరి ఐదు లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు. ATM కార్డ్ బ్లాకింగ్ స్టేటస్‌ను, అలాగే కార్డ్ డిస్పాచ్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. SBI టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా, కస్టమర్‌లు తమ చెక్‌బుక్‌ల డిస్పాచ్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల మునుపటి ఏటీఎం కార్డ్‌ బ్లాక్ అయినపక్షంలో...  కొత్త ATM కార్డ్ కోసం అభ్యర్థించవచ్చు. SBI టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు వారి DS వివరాలను, డిపాజిట్ వడ్డీ ధ్రువీకరణ పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పొందవచ్చు. 


SBI వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి టోల్‌ఫ్రీ నంబర్‌లను డయల్ చేయవచ్చు. SBI 24X7 హెల్ప్‌లైన్ నంబర్‌లు 1800 1234 (టోల్-ఫ్రీ), 1800 11 2211 (టోల్-ఫ్రీ), 1800 425 3800 (టోల్-ఫ్రీ), 1800 2100 (టోల్-ఫ్రీ), లేదా... 080-26599990కు దేశంలోని అన్ని ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి డయల్‌ చేయవచ్చు. ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్‌ల వివరాలను 24 గంటల్లో ఫోన్‌లో తెలుసుకోవచ్చు. డిపాజిట్లు & లోన్ స్కీమ్‌లు, ఇతర సేవల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. 


ఈ నంబర్ల ద్వారా కూడా ఎస్‌బీఐని సంప్రదించవచ్చు... 

టోల్ ఫ్రీ నంబర్: 1800 11 2211, 

టోల్ ఫ్రీ నంబర్: 1800 425 3800, 

టోల్ నంబర్: 080-26599990. 


మీరు బ్యాంక్ సేవల పట్ల అసంతృప్తి గా ఉన్నపక్షంలో SBI  వెబ్‌సైట్ ప్రకారం 8008 20 20 20కి UNHAPPY అని రాసి SMS పంపవచ్చు.

Updated Date - 2022-06-28T02:09:31+05:30 IST