నేడు పనిచేయనున్న బ్యాంకులు

Jan 15 2022 @ 03:05AM

విజయవాడ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు శనివారం పనిచేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకులు కూడా యథావిథిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. వాస్తవానికి ప్రతి ఏటా సంక్రాంతి రోజున బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి సంక్రాంతి పండుగ సెలవును ఒకరోజు ముందుకు జరిపింది. 13న భోగి, 14న సంక్రాంతి సెలవును ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శనివారం అన్ని బ్యాంకులు పనిచేయాలని ప్రభుత్వం కొద్దిరోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.