ఒకపూటే పని చేసిన బ్యాంకులు

ABN , First Publish Date - 2021-04-24T04:58:08+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో బ్యాంకుల ఒకపూట పనివేళలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది రక్షణ దృష్ట్యా స్టేట్‌లెవల్‌ బ్యాంకర్ల కమిటీ నిర్ణయంతో ఒకపూట పనివేళలను అమలు చేస్తున్నారు.

ఒకపూటే పని చేసిన బ్యాంకులు
విజయనగరంలో మూతపడిన బ్యాంకు

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 23: కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో బ్యాంకుల ఒకపూట పనివేళలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది రక్షణ దృష్ట్యా స్టేట్‌లెవల్‌ బ్యాంకర్ల కమిటీ నిర్ణయంతో ఒకపూట పనివేళలను అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బ్యాంకులు పనిచేశాయి. కాగా ఈ విషయం తెలియని కొంతమంది ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్‌.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, కురుపాం, జియ్యమ్మవలస, సాలూరు తదితర  ప్రాంతాల్లో  మధ్యాహ్నం రెండు గంటల  తర్వాత బ్యాంక్‌ లావాదేవీలకు వచ్చిన వారు ఈసురోమంటూ ఇళ్లకు వెనుదిరిగారు.  జిల్లాలో బ్యాంకులు ఈ పనివేళలను వచ్చే నెల 15 వరకు అమలు చేయనున్నాయి.   

  

Updated Date - 2021-04-24T04:58:08+05:30 IST