closed:రాబోయే ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్

ABN , First Publish Date - 2021-07-17T16:05:47+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు రాబోయే ఐదురోజుల పాటు మూసివేస్తున్నామని భారతీయ రిజర్వు...

closed:రాబోయే ఐదు రోజులపాటు బ్యాంకులు బంద్

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు రాబోయే ఐదురోజుల పాటు మూసివేస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు శనివారం వెల్లడించింది. రిజర్వు బ్యాంకు క్యాలెండరు నోటిఫికేషన్ ప్రకారం జులై 21వతేదీన బ్యాంకులన్ని మూసి ఉంచుతారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని నగరమైన డెహ్రాడూన్ లో హరేలా పూజ సందర్భంగా బ్యాంకులను మూసివేశారు. యు టిరోట్ సింగ్ డే ,ఖార్చి పూజల సందర్భంగా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా, మేఘాలయలోని షిల్లాంగ్ నగరాల్లో బ్యాంకులు మూసివేశారు.వారాంతమైన ఆదివారం (జులై18) బ్యాంకులు పనిచేయవు.


సిక్కిం రాజధాని నగరమైన గ్యాంగ్ టక్ లో సోమవారం (జులై 19) గురు రింపోచే సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మంగళవారం (జులై 20) బక్రీద్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, తిరువనంతపురం నగరాల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఈదుల్ అదా పండుగ సందర్భంగా భారతదేశంలోని అన్ని నగరాల్లో బ్యాంకులు మూసిఉంచుతారు. అయితే ఐజాల్, కొచ్చి, తిరువనంతపురం,భువనేశ్వర్, గ్యాంగ్ టక్ లలో మాత్రం జులై 21 న బ్యాంకులు పనిచేస్తాయని ఆర్బీఐ తెలిపింది. 

 

Updated Date - 2021-07-17T16:05:47+05:30 IST