కరోనా వ్యాక్సిన్ వేసుకొని వారిపై నిషేధం: ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-08T00:51:23+05:30 IST

కరోనా వ్యాక్సిన్ వేసుకొని వారిపై నిషేధం: ప్రభుత్వం

కరోనా వ్యాక్సిన్ వేసుకొని వారిపై నిషేధం: ప్రభుత్వం

డిస్‌పూర్: అస్సాం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ సమయాన్ని మార్చింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 15 నుంచి టీకాలు తీసుకొని వ్యక్తులను బహిరంగ ప్రదేశాల నుంచి నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రజా రవాణా 100 శాతం సీటింగ్‌లో పనిచేయగలదని, పూర్తిగా టీకాలు వేసుకొని వ్యక్తులు, మాస్కులు ధరించని వ్యక్తులకు రూ.1,000 జరిమానా విధించబడుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బీపీఎల్ కార్డ్ హోల్డర్‌లకు మాత్రమే ఉచిత కోవిడ్-19 చికిత్స అందించబడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2022-01-08T00:51:23+05:30 IST