అమ్మానాన్న లేరు.. అమ్మఒడి కావాలి..

ABN , First Publish Date - 2022-05-24T05:58:44+05:30 IST

ల్లిదండ్రులు చనిపోయారు.. అమ్మమ్మ దగ్గర ఉంటున్నాను.. ఆమె రేషన్‌ కార్డులో నా పేరు లేదు.. నాకు అమ్మఒడి ఇప్పించండి.. అంటూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ను ఓ చిన్నారి కోరాడు.

అమ్మానాన్న లేరు.. అమ్మఒడి కావాలి..
అమ్మఒడి కావాలంటూ కలెక్టర్‌ను కోరుతున్న బయట మంజులూరు పాఠశాల విద్యార్ధి

స్పందన కలెక్టర్‌ను కోరిన విద్యార్థి


బాపట్ల, మే 23: తల్లిదండ్రులు చనిపోయారు.. అమ్మమ్మ దగ్గర ఉంటున్నాను.. ఆమె రేషన్‌ కార్డులో నా పేరు లేదు.. నాకు అమ్మఒడి ఇప్పించండి.. అంటూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ను ఓ చిన్నారి కోరాడు. వివరాల్లోకి వెళితే.. మణికంఠ అనే విద్యార్థి అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరులోని బయటమంజులూరు మండలపరిషత్‌ ప్రాఽథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి  చదువుతున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నాడు.  అమ్మమ్మ రేషన్‌కార్డులో అతని పేరు లేనందున అమ్మఒడి జాబితాలో రాలేదు. గత ఏడాది అమ్మఒడి రాకపోవటంతో ఈ ఏడాది అయినా అమ్మమ్మ కార్డులో పేరు నమోదు చేసి అమ్మఒడి ఇప్పించాలని స్పందన కార్యక్రమంలో  కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ను   మణికంఠ కోరారు.  దీనిపై స్పందించిన కలెక్టర్‌  అమ్మఒడి వచ్చేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-05-24T05:58:44+05:30 IST