మొక్కుబడిగా కిసాన్‌మేళా

Published: Sun, 27 Mar 2022 00:30:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మొక్కుబడిగా కిసాన్‌మేళాసభా ప్రాంగణంలో ఖాళీగా ఉన్న కుర్చీలు

మాచారం లేకపోవడంతో హాజరుకాని రైతులు..

వాళ్లు రాకుంటే మేమెందుకంటూ ముఖ్యఅతిథులు...

బాపట్లలో కిసాన్‌ మేళా నిర్వహణా లోపం


 బాపట్ల, మార్చి 26: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బాపట్లలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాలలో కిసాన్‌మేళా ఏర్పాటు చేశారు. శనివారం దీనిని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ప్రారంభించాల్సి ఉంది. అయితే నిర్వహణ లోపం కారణంగా రైతులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరూ రాలేదు. రైతులు రాలేదనే సమాచారంతో డిప్యూటీ స్పీకర్‌ కూడా హాజరు కాలేదని వైసీపీ నాయకులు వేదికపైనే చెప్పారు. దీంతో రిబ్బన్‌ కట్‌ చేయకుండానే వదిలేశారు. పైగా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ కూడా హాజరు కాలేదు. శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ అధికారుల సమన్వయ లోపంతో కిసాన్‌ మేళా గురించి రైతులకు చెప్పటం మరిచారు. చివరకు వ్యవసాయాధికారులకు ఒక పూట ముందు  సమాచారం ఇచ్చి రైతులను తీసుకొని రమ్మని చెప్పారు. అయితే రబీసాగులో బిజీగా ఉన్న రైతులు ముందుగా సమాచారం చెప్పక పోవటంతో పదుల సంఖ్యలో మాత్రమే వచ్చారు. కళాశాల విద్యార్థులు, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు మాత్రమే హాజరు కావటంతో కుర్చీలన్నీ ఖాళీగా ఉండిపోయాయి. రైతులు హాజరుకాకపోవడంపై శాస్త్రవేత్తలు, రైతునాయకులు నిర్వాహకులను తప్పుపట్టారు. 

 యాంత్రీకరణ అభివృద్ధి చెందాలి 

 రైతుల అవసరాలకు తగ్గట్లు వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధి చెందాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ డాక్టర్‌ కె.యల్లారెడ్డి తెలిపారు. కిసాన్‌ మేళాలో ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా రైతులు పెట్టుబడి తగ్గించుకునే అవకాశంపై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి యూనివర్సిటీకి డ్రోన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ రాబోతుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో రైతులను భాగస్వాములను చేయలేకపోవటం సరికాదన్నారు. ఎక్కువమంది రైతులు పాల్గొంటే అవగాహన పెంపొందుతుందన్నారు. విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోర్డుమెంబరు డాక్టర్‌ వి.శ్రీనివాసరావు,  కళాశాల అసోసియేట్‌డీన్‌ డాక్టర్‌ డి.భాస్కరరావు, అగ్రికల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.శివకుమారి, యూనివర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఎల్‌.ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.