బాపట్ల: జిల్లాలో వైసీపీ మట్టి మాఫీయా దాడులకు తెగబడింది. చుండూరు మండలం చినగాదెలవర్రులో నక్కా లక్ష్మయ్యపై మట్టి మాఫియా దాడి చేసింది. చినగాదెలవర్రులోని చెరువులో వైసీపీ మట్టి తవ్వకాలు చేపట్టింది. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో చెరువును పరిశీలించారు. ఈ క్రమంలో నక్కా లక్ష్మయ్యను చెరువు వద్ద ఇనుప రాడ్‌తో మట్టి మాఫియా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి