సప్లయ్‌ చానల్‌కు గండ్లు

ABN , First Publish Date - 2022-06-28T06:37:09+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా భూగర్భ జలాలు పెంచి తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు తయారు చేస్తుండగా మరోవైపు ఉచితంగా వచ్చే నీటిని చెరువులకు తరలించేందుకు ఉన్న అవకాశంలను సద్వినియోగం చేసుకోవడం లేదు.

సప్లయ్‌ చానల్‌కు గండ్లు
చాపలమడుగు వద్ద సప్లయ్‌ ఛానల్‌ నుంచి వృథాగా పోతున్న నీరు

చెరువులకు చేరని నీరు

పది గ్రామాలకు తీరని నష్టం

 పుల్లలచెరువు, జూన్‌ 27: ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా  భూగర్భ జలాలు పెంచి  తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు తయారు చేస్తుండగా మరోవైపు ఉచితంగా వచ్చే నీటిని చెరువులకు తరలించేందుకు ఉన్న అవకాశంలను సద్వినియోగం చేసుకోవడం లేదు. త్రిపురాంతకం చెరువు సహా పది గ్రామాల చెరువు నింపే సప్లయ్‌ చానల్‌కు కనీసం మరమ్మతులు కూడా చేయక పోవడంతో నీరు వృథాగా పోతోంది.

నల్లమలలో దువ్వలేరు వాగు నుంచి గ్రామంలోని చెరువులోని నీటిని అందించేందుకు సప్లయ్‌ చానల్‌ ఉంది. ఇంచుమించు 20 కిలోమీటర్లు ఉన్న ఈ చానల్‌తో వివిధ గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపుతారు. మండలంలోని  కోమరోలు- కోత్తపల్లి, చాపలమడుగు, చెన్నంపల్లి, త్రిపురాంతకం మండలం లోని రామసముద్రం, త్రిపురాంతకం  సప్లై ఛానల్‌కు గ్రహణం పట్టింది. సప్లై ఛానల్‌ ద్వారా నల్లమల అటవీ ప్రాంతంలో పాటు యండ్రపల్లి, మ ల్లాపాలెం, కోమరోలు, కొత్తపల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో కురిసిన  వర్షాలకు  దువ్వలేరుకు వరద నీరు చేరుతుంది.  కొత్తపల్లి సమీపంలో  దువ్వలేరు కాలువ నుంచి  ఈ సపై చానల్‌కు నీరు  పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో పుల్లలచెరువు మండలంలోని చెన్నంపల్లి కొత్తకుంట చెరువు, త్రిపురాంతంకం మండలంలోని  త్రిపురాతంకం చెరువు, రామసముద్రం చెరువులకు  నీరు చేరుతోంది. గత ఐదేళ్లగా కురుస్తున్న వర్షాలకు  ఈ ఛానల్‌ ద్వారా  నీరు పెద్ద ఎత్తున వచ్చింది. చాపలమడుగు వద్ద కాలువ గట్టు  ఎత్తు పెంచకపోవడం,  ముల్లకంప  అడ్డుపడడంతో   నీరు వృథాగా పోతోంది. చాపలమడుగుకు సమీపంలో ఉన్న మరో పాతబిడ్జీ పెద్ద గండి పడి నీరు అంతా వృథాగా దువ్వలేరులో కలిసి  పోతుంది. గతంలో రైతులు పలుమార్లు కాలువకు పడిన గండ్లు తాత్కాలికంగా పుడ్చిన నూతన ప్రభుత్వం వచ్చాక చిల్లకంప తొలగించలేదు. దీంతో  కట్టకు పెద్ద పెద్ద గండ్లు పడి చెరువులకు నీరు చేరే అవకాశశం లేకుండా పోయింది. ఈ సప్లై చానల్‌ సక్రమంగా పని చేస్తే  రెండు మండలాల్లోని  సూమారు 10 గ్రామాలకు భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగు నీటి సమస్యలు తీరునున్నాయి. ఇ ప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి  పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి  వినియోగంలోకి తీసుకోనిరావాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-06-28T06:37:09+05:30 IST