AP new bar licenses: వైసీపీ నేతల అనుచరులకే బార్లు.. ఏపీ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి

ABN , First Publish Date - 2022-07-31T21:46:17+05:30 IST

ఏపీ (AP)లో రెండో రోజు ఆదివారం బార్ల ఈ వేలం (Bars Auction) వేశారు. వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులతో వ్యాపారులు వెనక్కి తగ్గారు.

AP new bar licenses: వైసీపీ నేతల అనుచరులకే బార్లు.. ఏపీ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి

అమరావతి: ఏపీ (AP)లో రెండో రోజు ఆదివారం బార్ల ఈ వేలం (Bars Auction) వేశారు. వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. ప్రధాన నగరాల్లో వైసీపీ నేతల అనుచరులే బార్లను దక్కించుకున్నారు. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ఆదాయం తగ్గింది. బార్ల ఈ-వేలంలో మెజారిటీ ప్రాంతాల్లో రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం వ్యాపారులు సిండికేట్‌లుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ-వేలం (E-Auction)లో ధర పెరగకుండా వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకున్నారు. కోస్తాలోని 6 జిల్లాల్లో 500 బార్లకు ఈ-వేలం వేశారు. నెల్లూరు, ఒంగోలు (Nellore, Ongole), గుంటూరు, విజయవాడ, కాకినాడ, అమలాపురంలో అంతా కాంప్రమైజ్ అయినట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో మద్యం షాపు రూ.1.47 కోట్లు పలికింది. ఇదే జిల్లాలోని అద్దంకిలో రూ.1.37 కోట్లకు టెండర్ (Tender) పాడారు. మార్కాపురంలో రూ.1.17 కోట్లు, చీమకుర్తిలో రూ.1.7 కోట్లకు వేలం పాడారు. వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులతో వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ఆదాయం తగ్గింది. ప్రధాన నగరాల్లో వైసీపీ నేతల అనుచరులకే బార్ల టెండర్లు ఇచ్చారు. సాధ్యంకాని ప్రాంతాల్లో భాగస్వామ్యం ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం. 


ఏపీ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి పడిందని అంటున్నారు. వైసీపీ (YCP) కీలక నేత తెరవెనుక చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. కాకినాడ కార్పొరేషన్‌ (Kakinada Corporation) పరిధిలో 11 బార్లకు వేలం వేశారు. ఈ-వేలానికి కేవలం 11 మంది హాజరయ్యారు. ప్రభుత్వ ధరకు కేవలం 2 లక్షలే అదనంగా వ్యాపారులు వేలం పాడారు. ముందే పోటీ నుంచి ఏడుగురిని వైసీపీ కీలక నేత తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున మామూళ్లు ఇచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో బార్ల ఈ-వేలం ప్రక్రియ ముగిసింది. తిరువూరు మినహా అన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారారు. తిరువూరులో అత్యధికంగా రూ.59 లక్షలు షాపును దక్కించుకున్నారు. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 110 బార్లకు గానూ 109 బార్లకు వేలం వేశారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో.. ప్రభుత్వం రూ.50 లక్షలు నిర్ణయించగా.. రూ.54 లక్షలకు వ్యాపారులు పాడారు. ప్రభుత్వ ధర కంటే రూ.4 లక్షలు మాత్రమే అధికంగా ఆదాయం వచ్చింది. తొలి రోజు శనివారం బార్ల ఈ వేలాలనికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రాయలసీమ (RayalaSeema), ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 323 బార్ల (Bars)కు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం రూ.258 కోట్ల ఆదాయం వచ్చింది. రాయలసీమ జిల్లాల్లో బార్ల వేలంలో ఎక్కువగా వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. కడపలో అత్యధికంగా ఓ బార్‌కు రూ.1.89 కోట్లు వెచ్చించారు.


‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం’’ ఇదీ మేనిఫెస్టోలో వైసీపీ ఇచ్చిన వాగ్దానం. అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడీ వాగ్దానం అటకెక్కింది. అసలు మా మేనిఫెస్టోలో మద్య నిషేధమే లేదని సాక్షాత్తూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బుకాయించేశారు. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది. భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా ప్రకటించుకున్న మేనిఫెస్టోను వైసీపీ నేతలే మడత పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-07-31T21:46:17+05:30 IST