Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. కిచెన్లలోనే స్నానాలు చేస్తున్న సిబ్బంది

ABN , First Publish Date - 2022-08-05T22:23:42+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో దారుణం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజుల నుండి మెస్‌లలో విద్యార్థులకు

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. కిచెన్లలోనే స్నానాలు చేస్తున్న సిబ్బంది

బాసర: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో దారుణం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజుల నుండి మెస్‌లలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు రావడం, ఇటీవలే ఫుడ్ పాయిజన్‌ (Food poison) జరిగి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌పాయిజనింగ్‌ కారణంగానే సంజయ్‌ అనే విద్యార్థి మరణించాడని,  అక్కడ భోజనం చేసిన నాటి నుంచే అనారోగ్యం బారిన పడ్డాడని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్న అక్కడి సబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కిచెన్లలోనే స్నానాలు చేస్తూ అక్కడి సిబ్బంది విద్యార్థుల కండపడ్డారు. ఓ వైపు వంట చేస్తూ.. మరో వైపు సిబ్బంది స్నానాలు చేస్తున్నారని విద్యార్థులు (students) చెబుతున్నారు. కలుషిత నీటితో వంట చేస్తున్నారని విద్యార్థుల ఆరోపిస్తున్నారు. కేంద్రీయ బండార్ మెస్లో స్నానాలు చేస్తున్న దృశ్యాలను విద్యార్థులు బయటపెట్టారు. ఇటీవల కూడా బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో యూనివర్సిటీలో ఆందోళనలు చెలరేగాయి. తరచూ ఫుడ్ పాయిజన్ అవుతోందని, హాస్టల్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనిర్సిటీకి పూర్తి స్థాయి వీసీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జి వీసీ చర్చలతో ఈ ఆందోళనను  విద్యార్థులు విరమించారు


బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు భరోసా కల్పించే చర్యలు చేపడుతున్నారు. ఇటీవలే ఫుడ్ పాయిజన్‌ జరిగి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో మరోసారి అలాంటి ఘటన జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి విద్యార్థులతో కలిసి డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు భోజనం చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని వారి సమక్షంలోనే భుజించారు. అనంతరం వంటకు వినియోగించే సరుకులను డైరెక్టర్‌ తనిఖీ చేశారు. గతంలో పొరపాట్లు జరిగి ఉండవచ్చుకానీ ఇప్పుడు మాత్రం విద్యార్థులకు నాణ్యత గల ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్‌ సతీష్‌ కుమార్‌ తెలిపారు. అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులకు భరోసా ఇచ్చిన గంటల వ్యవధిలోనే మెస్‌లో సిబ్బంది స్నానాలు చేస్తూ బయటపడడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-08-05T22:23:42+05:30 IST