
నిర్మల్: బాసర సరస్వతీ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కాత్యాయని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్ర పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరోవైపు అక్షరాభ్యాస మంటపాలు,క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.