కొనసాగుతున్న Basara Triple IT విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-16T16:34:44+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన మూడో రోజు కొనసాగుతోంది.

కొనసాగుతున్న Basara Triple IT విద్యార్థుల ఆందోళన

Basara‌: Nirmal జిల్లా బాసర (Basara) రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT-Triple IT)లో విద్యార్థుల (Students) ఆందోళన  మూడో రోజు గురువారం కొనసాగుతోంది. మెయిన్ గేటు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆర్‌జీయూకేటీ రెండో గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. మద్దతుగా వచ్చిన విద్యార్థుల కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 12 డిమాండ్లతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.


ఎనిమిది వేల మంది విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి వర్సిటీలో నెలకొన్న సమస్యలపై గొంతెత్తారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద రోజంతా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వర్షంలో తడుస్తూనే  కదలకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. సీఎం  కేసీఆర్‌ వర్సిటీకి వచ్చి.. సమస్యలు పరిష్కరించేదాక  ఆందోళన ఆపబోమని స్పష్టంచేశారు. సోషల్‌ మీడియా వేదికగానూ వేల మంది విద్యార్థులు తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ హమీ ఇచ్చినా.. వైస్‌ చాన్సలర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. మాటలు చెప్పొద్దని.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని సోషల్‌ మీడియా వేదికగా మంత్రులకు విద్యార్థులు ఘాటైన సమాధానాలిచ్చారు.

Updated Date - 2022-06-16T16:34:44+05:30 IST