నేటి నుంచి బేస్‌లైన్‌

ABN , First Publish Date - 2022-07-22T05:33:09+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నుంచి విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించ నున్నారు. 2 నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష జరగనుం ది. విద్యార్థుల్లో ప్రతిభను పరిశీలించేందుకు పరీక్షలు నిర్వహి స్తున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 26 వరకూ కొనసాగనున్న పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,326 ప్రాథమిక, 481 ప్రాథమికోన్నత, జిల్లా

నేటి నుంచి బేస్‌లైన్‌

2 నుంచి పదో తరగతి విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు

కలెక్టరేట్‌, జూలై 21: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నుంచి విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించ నున్నారు. 2 నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష జరగనుం ది. విద్యార్థుల్లో ప్రతిభను పరిశీలించేందుకు పరీక్షలు నిర్వహి స్తున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 26 వరకూ కొనసాగనున్న పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,326 ప్రాథమిక, 481 ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,58,157 మంది విద్యార్థులు ఉన్నారు. కేజీబీవీతో పాటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో సైతం పరీ క్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెలుగు, శనివా రం ఇంగ్లీష్‌, 25న గణితం పరీక్ష నిర్వహిస్తారు. మొదటిగా మౌఖిక పరీక్ష.. తరువాత రాత పరీక్ష ఉంటుంది. ప్రతీ పాఠశా లకు రెండు నమూనా ప్రశ్నపత్రాలు ఇస్తారు. ప్రతి నమూనా ప్రశ్నపత్రంలో ఐదు స్థాయిలు ఉంటాయి. ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరాల స్థాయి, కఽథా స్థాయిగా విభజించారు. గణితంలో ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు, మూడు అంకెల సంఖ్యలు, గణిత ప్రక్రియలు ఉంటాయి. ఆంగ్లంలో ప్రారంభస్థాయి, క్యాపిటిల్‌, స్మాల్‌ లెటర్స్‌ పదాలు, వాక్యాలు ఉంటాయి. వీటి ఆధారంగా విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తిస్తారు. మౌఖిక పరీక్ష అనంతరం పిల్లల స్థాయిని రిజస్ట్రర్‌లో నమోదు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేస్తారు. ఇక మౌఖిక పరీక్ష నాలుగు, ఐదు స్థాయిలో ఉన్న విద్యార్థులకు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. గణితంలోని మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విత ప్రక్రియ చేయగలిన విద్యార్థులకు రాత పరీక్ష రాసినట్లు పరిగణిస్తారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తెలుగు, గణితం, ఆంగ్ల పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష నాలుగు స్థాయిల్లో ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. 




Updated Date - 2022-07-22T05:33:09+05:30 IST