బంజరు భూముల్లో తులసి సాగు!

ABN , First Publish Date - 2021-07-27T06:55:00+05:30 IST

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైతులు బంజరు భూముల్లో తులసి మొక్కలను

బంజరు భూముల్లో తులసి సాగు!

ఔరంగాబాద్‌, జూలై 26: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైతులు బంజరు భూముల్లో తులసి మొక్కలను సాగు చేయడం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నారు. 16 మందితో కూడిన రైతుల బృందం బంజరు భూముల్లో ఎకరానికి 15,000-18,000 చొప్పున తులసి మొక్కలు నాటింది. తద్వారా ఏడాదికి రూ.70,000 నుంచి 1.83 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మూడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఫార్మా కంపెనీ ఈ రైతులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అప్పటి నుంచి కేకట్‌ జల్‌గ్రామ్‌, కుత్బ్‌ఖేడ, దావర్వాడిలో రైతులు తులసి సాగు చేస్తున్నారు.  


Updated Date - 2021-07-27T06:55:00+05:30 IST