
నిర్మల్: జిల్లాలోని బాసరలో గల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఆలయానికి 120 రోజుల హుండీ ఆదాయం రూ.36.90 లక్షలు వచ్చింది. దీనిలో 51 గ్రాముల మిశ్రమ బంగారం, కిలో 790 గ్రాముల మిశ్రమ వెండిని అమ్మవారికి భక్తులు కానుకలుగా హుండీలో వేశారు. అలాగే 12 డాలర్ల విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించారు.