Basra Universityలో కప్పలు, పురుగులతో కూడిన భోజనం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

Published: Thu, 24 Mar 2022 12:29:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Basra Universityలో కప్పలు, పురుగులతో కూడిన భోజనం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

టిఫిన్‌లో కప్పలు, లంచ్‌లో పురుగులతో ఇటీవల వార్తలలో నిలిచిన బాసర ట్రిపుల్‌ ఐటీలో ఏం జరగలేదుట... తెలంగాణ విద్యాశాఖామంత్రి ఇచ్చిన క్లీన్‌ చిట్‌ ఇది. కళ్ళెదుటే ఆధారాలు కనిపిస్తున్నా క్లీన్‌ చిట్‌ ఇవ్వడం వెనుక ఏం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఈయూనివర్సిటీపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయం ఏమిటి అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం.. 


విద్యార్థులకు ఆశాదీపంలా యూనివర్సిటీ

ఆర్జీయూకేటీగా ప్రసిద్ధిగాంచిన బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అంట్‌ టెక్నాలజీస్‌ పరిపాలన గాడితప్పుతోంది. కుప్పలు తెప్పలుగా తప్పులు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. వేలాదిమంది పేద విద్యార్థులకు ఆశాదీపంలా నిలుస్తున్న ఈ యూనివర్సిటీలో ఇటీవల పరిణామాల వెనుక అనేక చేదు నిజాలు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని గుదిబండగా భావిస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో చదువులలో నాణ్యత కొరవడింది. అధికారులు, కాంట్రాక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛ దొరికింది. 

Basra Universityలో కప్పలు, పురుగులతో కూడిన భోజనం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

ఇదేంటని ప్రశ్నిస్తే వేధింపులు..!

యూనివర్సిటీలోని ప్రతి పని వీరికి బంగారుబాతులా మారింది. వీరికి  టీఆర్‌ఎస్‌ నేతల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు పెట్టే భోజనంలోనూ నాణ్యత లోపించింది. కప్పలు, పురుగులతో కూడిన భోజనాన్ని చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు.దీనిపై ప్రశ్నించే విద్యార్థులను వేధిస్తున్నారని తెలిసింది. వరుసగా రోజులతరబడి పురుగుల భోజనమే అందిస్తుండటంతో విద్యార్థులు తిరగబడ్డారు. ఆందోళనకు దిగారు. ఈవిషయాలన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దీనిపై విచారణ జరిపి, నివేదికను విద్యాశాఖామంత్రికి అందించారు. ఇక్కడ కాంట్రాక్టరలు తమ లాబీయింగ్‌ మహిమ చూపారు. అంతే సాక్ష్యాలు, ఆధారాలు కనిపిస్తున్నా ట్రిపుల్‌ ఐటీలో సమస్యలే లేవంటూ మంత్రి క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై దుమారం రేగుతోంది. 

Basra Universityలో కప్పలు, పురుగులతో కూడిన భోజనం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటీస్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్జీయూకేటీ ఏర్పడింది. దీంతోపాటు నూజీవీడు, ఇడుపుల పాయ క్యాంపస్ లను ఏర్పాటు చేశారు. ఇవి ట్రిపుల్‌ ఐటీలుగా ప్రసిద్ధిగాంచాయి. అయితే  రాష్ట్ర విభజన తర్వాత బాసర  మాత్రమే తెలంగాణ కు మిగిలింది. కొత్త రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లయినా వైస్‌ఛాన్సలర్‌ నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కేవలం ఇంఛార్జీలతోనే నెట్టుకొస్తోంది.

Basra Universityలో కప్పలు, పురుగులతో కూడిన భోజనం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్‌ ఐటీ

బాసర క్యాంపస్ లో ప్రస్తుతం  8వేల మంది విద్యార్థులున్నారు.  ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్‌ ఐటీకి రెగ్యులర్‌ వీసీ ఉండాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది.  రాష్ట్ర విభజన తరువాత ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను కొన్నాళ్లు ఇన్‌చార్జీగా నియమించారు. ఈయన తరువాత ఇంటర్ బోర్డు కార్యదర్శి  డా. అశోక్‌కు  వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనో మూడేళ్లు కొనసాగారు. ఆయన హయాంలో క్యాంపస్ పాలన గాడి తప్పింది. అవినీతి అక్రమాలకు లెక్కలేకుండా పోయింది.  దీంతో 2020 ఫిబ్రవరి లో సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. కొద్ది నెలల క్రితం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించారు కానీ ఆర్‌జీయూకేటీని విస్మరించారు.

Basra Universityలో కప్పలు, పురుగులతో కూడిన భోజనం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

సీఎం కేసీఆర్‌కు అసలు ఇంట్రెస్ట్ లేదని వార్తలు

సహజంగా యూనివర్సిటీలకు గవర్నర్‌ చాన్సలర్‌గా ఉంటారు.  కానీ ఆర్‌జీయూకేటీకి ప్రత్యేక చట్టం చేశారు. దీని ప్రకారం గవర్నర్‌ కాకుండా ఇతరులు ఛాన్స్‌లర్‌,వైస్‌ఛాన్స్‌లర్‌గా ఉండాలి. ఈ చట్టానికి సవరణ చేసి, అన్నియూనివర్సిటీలకు వర్తించే నిబంధనలే ఆర్జీయూకేటీకి వర్తించేలా చేస్తే సమస్య తీరుతుంది. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఈ యూనివర్సిటీపై ఏమాత్రం శ్రద్ధ లేదటున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు అసలు ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది.   గురుకులాల విషయంలో చురుగ్గా వ్యవహరించే కేసీఆర్... అర్జీయూకేటిపై ఏనాడూ స్పందించలేదు. దీనిని గుదిబండగా భావించడం వల్లనే లైట్  తీసుకుంటున్నారని చెపుతున్నారు.  అందుకే నిధుల విడుదల లోనూ జాప్యం చేస్తున్నారంటున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఓ  వెలుగు వెలిగిన బాసర క్యాంపస్ తెలంగాణ ఏర్పడ్డాక నిర్లక్ష్యానికి గురికావడం విస్మయపరుస్తోంది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.