మేదరబస్తీ ఆక్రమణల తొలగింపులో రగడ

ABN , First Publish Date - 2021-07-27T04:43:40+05:30 IST

మేదరబస్తీలో రైల్వే అధికారులు సోమవారం చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం రగడ సృష్టించింది.

మేదరబస్తీ ఆక్రమణల తొలగింపులో రగడ
బస్తీవాసులతో మాట్లాడుతున్న వనమా

అడ్డుకున్న ఎమ్మెల్యే వనమా, సీపీఐ నాయకులు

కొత్తగూడెం టౌన్‌/ కొత్తగూడెం పోస్టాఫీస్‌సెంటర్‌ జులై 26: మేదరబస్తీలో రైల్వే అధికారులు సోమవారం చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం రగడ సృష్టించింది. రైల్వే అధికారులు తమ సిబ్బందితో కలిసి ఉదయం మేదరబస్తీలో ఆమ్రణల కూల్చి వేతకు శ్రీకారం చుట్టారు. ఏళ్లుగా అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న పేదలు అధికా రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూవారిని అడ్డుకున్నారు. వారికి మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మద్దతు తెలియజేస్తూ వారితో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలు సుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. బీదలకు అన్యాయం చేసే కార్యక్రమాలను నిలిపివేయాలని అధికారులను కోరారు. దీంతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగింది. ఆనంతరం రైల్వే అధికారులు జిల్లా ఎస్పీకి విషయం తెలియజేసి పోలీసుల సహాయం కోరారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తుతో వచ్చిన అధికారులు నిర్ణీత సమయం గడువు ఇచ్చి రైల్వే స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రజలకు హుకుం జారీ చేశారు. దీంతో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఏస్‌కే సాబీర్‌పాషా నేతృత్వంలో మేదర్‌బస్తీ వాసులు రైల్వే స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తదనంతరం కలెక్టర్‌ కార్యాలయం ముందు రొడ్డుపై పడుకుని నిరసన తెలిపి దర్నా కార్యక్రమం నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ చంద్రశేఖర్‌రావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సీతాలక్ష్మి, కొత్తగూడెం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్‌ వీరయ్య, టీఅర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, జిల్లా సీపీఐ నాయకులు అయోధ్య పాల్గొన్నారు.

మేదరబస్తీ ఇళ్లు కూల్చడం దారుణం

మేదర బస్తీ, తుమ్మల నగర్‌లో ఇళ్లను కూల్చడం దారుణమని టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ అన్నారు. సోమవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్‌ ప్రాంగణ పరిధిలోని గృహసముదాయాలను నేల మట్టం చేయడంతో బాధితులకు అధికారులే పునరావాసం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు రాయల శాంతయ్య, అర్జున్‌రావు, నాగేందర్‌, తోట దేవీప్రసన్న, వెంకటేశ్వర్లు, ఏలూరు రాజేష్‌, కొప్పుల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:43:40+05:30 IST