బస్వాపూర్‌ నిర్వాసితులకు ఊరట

ABN , First Publish Date - 2021-05-11T06:43:38+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చింది.

బస్వాపూర్‌ నిర్వాసితులకు ఊరట
భువనగిరి మండలంలో నిర్మిస్తున్న బస్వాపూర్‌ రిజర్వాయర్‌

 హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు

పరిహారం ఇవ్వాలని నిర్వాసితుల డిమాండ్‌
యాదాద్రి, మే 10 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా  జిల్లాలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర హైకోర్టు ఊరటనిచ్చింది. దశాబ్దాలుగా ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటు న్న రైతులకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా రిజర్వాయర్‌ పనులు చేపట్టకుండా హైకోర్టు స్టేట్‌సకో ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి మండ లం బస్వాపూర్‌ రెవెన్యూ సర్వేనెంబరు 229లో 110ఎకరాల 24గుంటల పిటీషనర్ల భూముల్లో ఎటువంటి పనులు చేయకుండా న్యాయమూర్తి జస్టిస్‌ ఏ.అభిషేక్‌రెడ్డి యథాతథ స్థితిని అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీశారు. భువనగిరి మండలం బస్వాపూర్‌లోని 229 సర్వే నెంబర్‌లోని 110 ఎకరాల 24గుంటల భూమిని 91మంది అనుభవదారులుగా సాగు చేసుకుంటున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్‌ వద్ద 11.39 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి కావల్సిన భూములను పట్టాదారుల నుంచి సేకరించి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వ భూమిలో తరతరాలుగా సాగుచేసుకుంటున్న రైతులకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, నష్టపరిహారం, పునరావస కార్యక్రమాలు చేపట్టకుండా రిజర్వాయర్‌ పనులు చేపడుతున్నారు. దీంతో న్యాయం కోసం నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్‌ 13వ తేదీన న్యాయమూ ర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి పిటిషనను విచారించి స్టేటస్‌కో ఉత్తర్వులిచ్చారు. ఇం దుకు సంబంధించిన ఉత్తర్వు కాపీలు సోమవారం నిర్వాసితులకు  అందాయి. దీంతో తమ సాగు భూములకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా చేపడుతున్న రిజర్వాయర్‌ పనులు నిలిచిపోయి నిర్వాసితులకు ఊరట కలిగింది. త మ స్వాధీనంలో ఉండి సాగుచేసుకుంటున్న భూములకు భూసేకరణ చట్టం- 2013 ప్రకారం పరిహారం, పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలని నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.
నష్టపరిహారం చెల్లించాలి
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ యదా ద్రి జిల్లా నాయకుడు ఏశాల అశోక్‌ డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఏకపక్షంగా పనులు చేపట్టడానికి ప్రభుత్వ యత్నాలకు హైకోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులతో బ్రేక్‌ పడిందని, ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - 2021-05-11T06:43:38+05:30 IST