`బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌' విజ‌య‌వంతం!

Published: Mon, 08 Aug 2022 16:51:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
`బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌ విజ‌య‌వంతం!

డాక్టర్ హనిమి రెడ్డి, జయరాం కోమటి భారీ విరాళం ప్రకటించారు!!


బే ఏరియా తెలుగు సంఘం (బాటా) స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లు అక్టోబర్ 22 న జరుగబోతున్న సందర్బంగా నిర్వ‌హించిన `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌' వేడుక‌ల‌కు తెలుగు వారు భారీ సంఖ్య‌లో హాజ‌రై విజ‌య‌వంతం చేశారు. లాభాపేక్ష ర‌హిత సంస్థ‌గా సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా 1971లో ఏర్ప‌డిన `బాటా` ఈ ఏడాదితో 50 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. ఈ అర్ధ శ‌తాబ్ద సుదీర్ఘ ప్ర‌యాణంలో 'బాటా'ను న‌డిపించిన వారు, 'బాటా'తో న‌డిచిన వారు, ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌వారు ఎంద‌రెంద‌రో ఉన్నారు. వారంద‌రినీ ఒకే చోటకు చేర్చి, `బాటా` స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించబోతున్నారు.


ప్ర‌గ‌తి `బాట‌` ఇదే!!

ప‌రోప‌కారార్థం అన్న‌ట్టుగా 'బాటా' రెండు తెలుగు రాష్ట్రాల్లోనివారికి అనేక క‌మ్యూనిటీ సేవ‌లు అందించింది. ఈ క్ర‌మంలో 'ఇంటికో పువ్వు = ఈశ్వ‌రుడికో మాల' అన్న చందంగా తాను చేస్తూ, మ‌రికొంద‌రిని క‌లుపుకొని ముందుకు సాగింది. ఫండ్ రెయిజింగ్ కార్య‌క్ర‌మాల‌తో నిధులు సేక‌రించి, అనేక కార్య‌క్ర‌మాలకు శ్రీకారం చుట్టిన `బాటా` ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు సాయం అందించింది.

`బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌ విజ‌య‌వంతం!

తెలుగు రాష్ట్రాల సేవ‌లో..

 • 10 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ నిధులు గుంటూరు SEF కంటి ఆసుప‌త్రి నిర్మాణానికి సేక‌రించారు.
 • 5 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ నిధులు హైద‌రాబాద్‌ SEF కంటి ఆసుప‌త్రి నిర్మాణానికి సేక‌రించారు.
 • SEF గుర్తించిన రెండు `సేవ‌ల భాగ‌స్వామ్య‌` సంస్థ‌ల్లో 'బాటా' ఒక‌టి కావ‌డం విశేషం.
 • గుంటూరులో ఎస్‌వీవీ యూఐపీ మ‌హిళా, శిశు వైద్య శాల ఏర్పాటుకు నిధులు సేక‌రించారు.
 • కార్గిల్ యుద్ధంలో ఆత్మార్ప‌ణ చేసిన సైనికుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు నిధులు సేక‌రించింది.
 • 2004లో వ‌చ్చిన సునామీతో బాధితులుగా మిగిలిన ఏపీలోని తీర ప్రాంత ప్ర‌జ‌ల‌కు సాయం అందించేందుకు 'బాటా' ఎంత‌గానో కృషి చేసింది.


అమెరికాలో..

అమెరికాలోని నిరుపేద‌లు, గృహ వ‌స‌తి లేనివారికి ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయ‌డంతోపాటు, వారికి నిత్యావ‌స‌రాల‌ను అందించేందుకు 'బాటా' ఎంతో కృషి చేసింది. `తానా`తో క‌లిసి, బోన్ మారో డ్రైవ్‌, బ్ల‌డ్ డ్రైవ్ వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

`బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌ విజ‌య‌వంతం!

తెలుగు సంస్కృతి..

 • తెలుగు వారి సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు `బాటా` పెద్ద పీట వేస్తోంది. సంక్రాంతి, ఉగాది, దీపావ‌ళి వంటి పండుగ‌ల‌ను 'బాటా' ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది.
 • ముగ్గుల పోటీలు, వంట‌ల పోటీలు వంటివాటిని నిర్వ‌హిస్తూ, తెలుగు సంస్కృతిని `బాటా` ప్రోత్స‌హిస్తోంది.
 • దివంగ‌త గాన‌ గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్య ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈటీవీ ప్రీమియ‌ర్ షో `పాడుతా తీయ‌గా` కార్య‌క్ర‌మాన్ని కూడా నిర్వ‌హించింది.
 • అదేవిధంగా జాతీయ స‌ద‌స్సుల‌కు సైతం 'బాటా' ఆతిథ్యం ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. 1994 'ఆటా' స‌ద‌స్సుకు, 2003 'తానా' కాన్ఫ‌రెన్స్‌కు, 2011' తానా' స‌ద‌స్సుకు 'బాటా' ఆతిథ్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.
 • పాఠశాల నిర్వహణలో కూడా 'బాటా' తన వంతు పాత్ర పోషిస్తోంది.

`బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌ విజ‌య‌వంతం!

'బాటా' తో సుదీర్ఘ అనుబంధం ఉన్న శ్రీమతి విజయ ఆసూరి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సహంగా ఉల్లాసంగా నడిపించారు. 'తానా' కార్యదర్శి సతీష్ వేమూరి మరియు రామ్ తోట ('తానా' నార్త్ కాలిఫోర్నియా రీజినల్ రెప్రెసెంటేటివ్) తమ మిత్రులతో కలసి భారీ విరాళాన్ని ప్రకటించారు. 'బాటా' ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు హరినాథ్ చికోటి ( 'బాటా' అధ్యక్షుడు), కొండల రావు (వైస్ ప్రెసిడెంట్), అరుణ్ రెడ్డి (కార్యదర్శి) , వరుణ్ ముక్క (కోశాధికారి) , శివ కదా (సంయుక్త కార్యదర్శి), స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి తిరువీధుల ,కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి, సాంస్కృతిక కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలూ వెలిగేటి, తారక దీప్తి, హరి సన్నిధి, సురేష్ శివపురం, శరత్ పోలవరపు, సంకేతం సందీప్, ఆదిత్య , గౌతమీ, హరీష్, ఉదయ్, క్రాంతి మరియు సలహా కమిటీ సభ్యులు వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, కళ్యా కట్టమూరి, కరుణ్ వెలిగేటి, తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసారు.


స్థానిక కమ్యూనిటీ ప్రముఖులు కిరణ్ ప్రభ సతీ సమేతంగా పాల్గొన్నారు. స్థానిక గాయకులు రవి గుడిపాటి మరియు మానస సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు. వేణు ఆసూరి, వెంకట్ మద్దిపాటి, గోవింద్ పసుమర్తి (మాజీ బాటా అధ్యక్షులు), యుగంధర్ రెడ్డి కరకాల (మాజీ బాటా అధ్యక్షులు), శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త బల్ల, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, మురళి గూడవర్తి, సురేష్ రెడ్డి ఉయ్యురు, శాస్త్రి వెనిగళ్ల, సుభాష్ రవడ, బాబు ప్రత్తిపాటి, లియోన్ రెడ్డి, హరి గక్కని, వెంకయ్య జెట్టి, శ్రీనివాస్ వీరపనేని, భరత్ ముప్పిరాళ్ల, కిరణ్ విన్నకోట, రాజు ఉప్పల, బాబీ పినపాల, వినయ్ పరుచూరి తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

ఓపెన్ హార్ట్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.