తెలంగాణలో బతకాలంటే పన్ను కట్టాల్సిన దుస్థితి

ABN , First Publish Date - 2022-05-23T06:20:33+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లాలన్నా పన్ను కట్టా ల్సిందేననే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

తెలంగాణలో బతకాలంటే పన్ను కట్టాల్సిన దుస్థితి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

గంభీరావుపేట, మే 22: తెలంగాణ రాష్ట్రంలో ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లాలన్నా పన్ను కట్టా ల్సిందేననే  పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.  గంభీరావుపేటలో బీజేపీ కార్యకర్తల ముగింపు శిక్షణా తరగతులకు బండి సంజయ్‌ ఆదివారం హాజరయ్యా రు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోవాల్సిన ము ఖ్యమంత్రి  టూరిస్ట్‌లా దేశమంతా తిరుగుతున్నారని, కొడుకు దోచిన సొమ్ము దాచుకోవడానికి విదేశాలకు వెళ్లారని అన్నారు.   బీజేపీ ఎదుగుదల చూ సి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు డిప్రెషన్‌లో పడ్డారన్నారు. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 30 రూపాయల జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 65 వేల కోట్లు లబ్ధిపొందిందన్నారు. మళ్లీ ఎన్నికలు రాగానే కేంద్రం పెట్రో ధరలు పెంచిందని ముఖ్యమంత్రి రాజకీయ పబ్బం గడుపుకుంటారన్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గినప్పుడు రాష్ట్రంలో కేసీఆర్‌ తగ్గించాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రజలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి పంజాబ్‌ వెళ్లి డబ్బులు పంచి తే ఇక్కడి ప్రజలు ఏమనుకుంటారోననే ఇంగిత జ్ఞానం లేని అజ్ఞాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే ఆదుకున్నారా?  కొండగట్టు బాధిత కుటుంబాలను ఆదుకున్నారా? ఇంటర్‌ విద్యార్థులు చని పోతే ఆదుకున్నారా? నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటే ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించిన వారిని సీఎం ఆఫీస్‌లో పెట్టుకున్నారని, కాసులకు కక్కుర్తి పడే అధికారులు సీఎం ఆపీస్‌లో ఉన్నారని అన్నారు. పీఎంవో ఆఫీస్‌లో  అలా ఉండరన్నారు. జిమ్మిక్కులు చేస్తూ రాష్ట్రంలో లబ్ధిదారులకు ఒక నెల  పింఛన్‌ డబ్బులను ముఖ్యమంత్రి  ఎగ్గొట్టారన్నారు. కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా సాగుతున్నాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. వరి వేయని రైతులకు  పరిహారం అం దించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, బీజేపీ  జిల్లా  అధ్య క్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమాకాంతారావు, ఎన్నం మహేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపి, మల్లికార్జున్‌,  జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షుడు గంట అశోక్‌, ముస్తాబాద్‌ మండల అధ్యక్షుడు కార్తీక్‌, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 

ముగిసిన శిక్షణా తరగతులు 

గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిసాయి. మొదటి రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీదర్‌రావు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. రెండో రోజు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు.  కార్యకర్తలు, నాయకత్వ సామర్థ్యంతోపాటు పలు అంశాలను వివరించారు. 


Updated Date - 2022-05-23T06:20:33+05:30 IST