చిన్నారికి స్నానం చేయిస్తున్నారా...

ABN , First Publish Date - 2021-01-21T05:33:34+05:30 IST

చిన్నారికి స్నానం చేయించేటప్పుడు చర్మం గాయపడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవి...

చిన్నారికి స్నానం చేయిస్తున్నారా...

చిన్నారికి స్నానం చేయించేటప్పుడు  చర్మం గాయపడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవి...


  • చిన్నారి పుట్టిన తొలి రోజుల్లో చర్మాన్ని సున్నితంగా, ఒత్తిడి లేకుండా మర్దన చేయాలి.
  •  అలాగే మర్దన నింపాదిగా, ప్రశాంతంగా చేయాలి.
  • చిన్నారులకు శరీరం మర్దన చేసే ముందు చేతులను రెండు మూడు సార్లు బాగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మీ  అరచేతులు వెచ్చగా ఉండి మీ స్పర్శ చిన్నారులకు ఇబ్బంది పెట్టదు.
  • చిన్నారులకు స్నానం చేయించేటప్పుడు వేళ్లకు గోళ్లు లేకుండా చూసుకోవాలి. లేకపోతే అవి చిన్నారి లేత చర్మాన్ని గాయపరచవచ్చు.
  •  చిన్నారులకు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయించాలి. స్నానం చేయించేటప్పుడు నీళ్లను మొదట చిన్నారుల వీపుపై పోయాలి. ఆ తర్వాత తలపై పోసి వెంటనే తెల్లని తువ్వాలుతో పొడిగా తుడవాలి.
  •  స్నామర్దన చేసి, స్నానం చేయిస్తే చిన్నారులు త్వరగా నిద్రపోతారు.
  • పిల్లలకు సున్నిపిండితో స్నానం చేయించడం వల్ల మేని ఛాయ పెరుగుతుంది.
  • పసిపిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేసి నలుగుపెట్టడం, కళ్లకు కాటుక పెట్టడం ఇంట్లో పెద్దవాళ్లు చేస్తే మంచిది.
  • కొబ్బరి నీటితో ముఖం, శరీర భాగాలను మర్దన చేస్తే చిన్నారుల చర్మం మిలమిలా మెరుస్తుంది.

Updated Date - 2021-01-21T05:33:34+05:30 IST