బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

ABN , First Publish Date - 2022-10-02T03:43:02+05:30 IST

జిల్లాలో సద్దుల బతుకమ్మ సందడి మొదలైంది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళల్లో ఉత్సాహం నెలకొంటుంది. జిల్లాలో సద్దుల బతుకమ్మను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏడవ రోజు, మరి కొన్ని ప్రాంతాల్లో 9వ రోజు వేడుకలు జరుపుకుంటారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
చెన్నూరులో సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలు

జిల్లాలో మొదలైన సద్దుల బతుకమ్మ సందడి

తాండూర్‌, అక్టోబరు 1: జిల్లాలో సద్దుల బతుకమ్మ సందడి మొదలైంది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళల్లో ఉత్సాహం నెలకొంటుంది. జిల్లాలో సద్దుల బతుకమ్మను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఏడవ రోజు, మరి కొన్ని ప్రాంతాల్లో 9వ రోజు వేడుకలు జరుపుకుంటారు. చివరి రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మకు విశిష్టత కనిపిస్తుంటుంది.  మహిళలు, యువతులు పోటా పోటీగా తీరొక్క పూలు సేకరించి బతుకమ్మలను పేర్చి మధ్యలో గౌరమ్మను ఏర్పాటు చేసి నూతన వస్ర్తాలు ధరించి ఆటాపాటలతో బతుకమ్మ ఆడుతారు. అనంతరం చెరువులు, వాగులలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. వెళ్ళిరా బతుకమ్మ మళ్ళీరా అంటూ సాగనంపుతారు. మహిళలు  పసుపు, కుంకుమ, వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. 

రెండు రోజుల పాటు వేడుకలు 

జిల్లాలో మొదటి నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఏడు, తొమ్మిదవ రోజు సద్దుల వేడుకలు జరుపుకుంటారు. ఏడవ రోజు శనివారం తాండూర్‌, చెన్నూరు ప్రాంతాల్లో పెద్దబతుకమ్మ నిర్వహించుకోగా సోమవారం మరికొన్ని చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా మైదానాలను తయారు చేసుకుని సామూహికంగా వేడుకలు నిర్వహించుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. 

మందమర్రి టౌన్‌:  పట్టణంలోని  సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధం చేశారు. సద్దుల బతుకమ్మకు సంబంధించి మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ  బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేస్తామని సింగరేణి సేవా సమితి  పేర్కొంది.   పట్టణంలో ఆరు బతుకమ్మ ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. పాలచెట్లు, పాత బస్టాండ్‌ ఏరియా, మార్కెట్‌ ప్రాంతంలో ఈ ఘాట్‌లు పూర్తి చేశారు.  ఘాట్‌ల వద్ద విధ్యుత్‌  దీపాలు ఏర్పాటు చేస్తున్నారు.  

చెన్నూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ

చెన్నూరు: పట్టణంలోని ముదిరాజ్‌, పద్మశాలి, బ్రహ్మణ కులస్తులు సద్దుల బతుకమ్మ వేడుకలను శనివారం నిర్వహించారు. వేకువజామున తీరొక్క పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం, లక్ష్మీదేవర ఆలయం, పద్మశాలి భవన్‌లో ఆటాపాటలతో నృత్యాలు చేస్తూ బతు కమ్మ సంబరాలు జరుపుకున్నారు పెద్ద చెరు వులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.  సీఐ ప్రవీణ్‌కుమార్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2022-10-02T03:43:02+05:30 IST