తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-25T04:04:20+05:30 IST

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరు పుకునే బతుకమ్మ వేడుకలు ప్రారంభించడం సంతోషంగా ఉందని కలెక్టర్‌ భార తి హోళికేరి అన్నారు. శనివారం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఎమ్మె ల్యే దివాకర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేక పండుగ బతుకమ్మ అన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 24: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరు పుకునే బతుకమ్మ వేడుకలు ప్రారంభించడం సంతోషంగా ఉందని కలెక్టర్‌ భార తి హోళికేరి అన్నారు. శనివారం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో  ఎమ్మె ల్యే దివాకర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేక  పండుగ బతుకమ్మ అన్నారు.  ఒక్కో రోజు ఒక్కో శాఖ నుంచి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం క్రీడా మైదానంలో బాస్కెట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆటలో పాల్గొన్నారు.  

అన్ని శాఖల సమన్వయంతో పండుగను విజయవంతం చేయాలని కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. బతుకమ్మ మైదానాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ అంతరాయం  లేకుండా చూడాలన్నరు. 

పంట కోత ప్రయోగాలపై శిక్షణ

కలెక్టరేట్‌లో పంట కోత ప్రయోగాలపై వ్యవసాయ, విస్తరణ, మండల ప్రణా ళిక అధికారులకు ఏర్పాటు చేసి జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు కలెక్టర్‌ హాజరయ్యారు. అధికారులు గ్రామాల్లో సందర్శించి శాస్ర్తీయ పద్ధతిలో ప్రయోగా త్మకంగా పంట కోత నిర్వహించాలన్నారు. ప్రయోగాలపై నివేదిక తయారు చేయాలని, వీటి ద్వారా స్థూల జాతీయోత్పత్తి గణనకు, వ్యవసాయ రంగ పరిశ్ర మల స్థాపనకు దోహదపడతాయని తెలిపారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పంట కోత ప్రయోగాలపై వివరించారు. ముఖ్య ప్రణాళిక అధికారి  సత్యం, వ్యవసాయ అధికారి కల్పన అధికారులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-09-25T04:04:20+05:30 IST