తెలంగాణ బతుకు చిత్రమే బతుకమ్మ : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-26T05:39:26+05:30 IST

తెలంగాణ ప్రజల బతుకు చిత్రమే బతుకమ్మ అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీబీనగర్‌ గ్రామపంచాయతీ వద్ద బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు బతుకమ్మతో ముడిపడి ఉన్నాయన్నారు.

తెలంగాణ బతుకు చిత్రమే బతుకమ్మ : ఎమ్మెల్యే
చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

బీబీనగర్‌, సెప్టెంబరు 25: తెలంగాణ ప్రజల బతుకు చిత్రమే బతుకమ్మ అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీబీనగర్‌ గ్రామపంచాయతీ వద్ద బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు బతుకమ్మతో ముడిపడి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ ప్రణితా పింగల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ గణేష్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ దస్తగిరి, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. 


సంప్రదాయాలను గౌరవిస్తున్న సీఎం  

భువనగిరి రూరల్‌: తెలంగాణ సాంప్రదాయాలను గౌరవిస్తూ సీఎం కేసీఆర్‌ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను కానుకగా అందజేస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బస్వాపురంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ రైతు సమన్వయ సమితి, ఏఎంసీ చైర్మన్లు జడల అమరేందర్‌, కొలుపుల అమరేందర్‌, ఎడ్ల రాజేందర్‌ రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, జనగాం పాండు, ఎంపీడీవో గుత్తా నరేందర్‌ రెడ్డి, సర్పంచ్‌ కస్తూరి మంజుల తదితరులున్నారు.


భూదాన్‌పోచంపల్లి: కేసీఆర్‌ తెలంగాణలోని నిరుపేద మహిళలకు పెద్దన్న అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని గ్రామాల మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌, ఎంపీడీవో ఎ బాలశంకర్‌, తహసీల్దారు బి.వీరాబాయి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 


మోత్కూరు: పూలను పూజించే సంప్రదాయం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని మోత్కూరు ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని పాటిమట్ల, దాచారంలో ఆమె మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.  

Updated Date - 2022-09-26T05:39:26+05:30 IST