ఆడబిడ్డల ఆనందం కోసమే బతుకమ్మ చీరల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-24T06:07:43+05:30 IST

ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

ఆడబిడ్డల ఆనందం కోసమే బతుకమ్మ చీరల పంపిణీ
:బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

- మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

ఇల్లంతకుంట, సెప్టెంబరు 23: ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  అన్నారు. మండలకేంద్రంలోని వైశ్యభవనంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగపూట నిరుపేదలు పడే ఇబ్బందులు తెలిసి సీఎం కేసీఆర్‌ మహిళలకు సారె ఇస్తున్నారన్నారు.  జిల్లాపరిషత్‌ ఉపాధ్యక్షుడు సిద్దం వేణు, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మామిడి సంజీవ్‌, తహసీల్దార్‌ స్వాతి, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, ఫ్యాక్స్‌ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, సర్పంచ్‌ కూనబోయిన భాగ్యలక్ష్మిబాలరాజు, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యయాదవ్‌,  రైతు బంధు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు చల్ల నారాయణ, రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ ఏలేటి మాధవరెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షుడు ఎండ్ర చందన్‌ పాల్గొన్నారు.

ఫ  పాత పింఛన్‌దారులకు ఎమ్మెల్యే కార్డులను  పంపిణీ చేశారు. అర్హులందరికీ  పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులు అందించారు.

Updated Date - 2022-09-24T06:07:43+05:30 IST