బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-25T05:04:04+05:30 IST

బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలి
జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ ఆటను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

వనపర్తి అర్బన్‌, సెప్టెంబరు 24: బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శనివారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన  కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్‌వాడీ టీచర్లు కిషోర బాలికలు, మహిళా ఉద్యోగులతో బొడ్డెమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చిన్న బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ కిశోర బాలికల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాలికలు మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే రక్తహీనతను ఎదుర్కొవచ్చని సూచించారు.  కార్యక్రమానికి నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన కిశోర బాలికలు హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాల్లో కృష్ణ చైతన్య డీడబ్ల్యూసీ చైర్మన్‌ అలివేలమ్మ, డీసీ పీవో రాంబాబు, డీఈవో రవీందర్‌ సిబ్బంది పాల్గొన్నారు. 




Updated Date - 2022-09-25T05:04:04+05:30 IST