ఆనాడే ఆ మాట చెప్పాం కానీ వినలేదు: భట్టి

ABN , First Publish Date - 2022-07-20T00:05:45+05:30 IST

పోలవరం కడితే 2లక్షల ఎకరాల భూమి గిరిజన గ్రామాలు మునుగుతాయని తాము ఆనాడే చెప్పామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు.

ఆనాడే ఆ మాట చెప్పాం కానీ వినలేదు: భట్టి

హైదరాబాద్: పోలవరం కడితే 2లక్షల ఎకరాల భూమి గిరిజన గ్రామాలు మునుగుతాయని తాము ఆనాడే చెప్పామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు నుంచి ఏడు మండలాలు తొలగించి కాంగ్రెస్ బిల్లు పాస్ చేసిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏడు మండలాలు ఆంధ్రలో కలిపారని చెప్పారు. ఏడు మండలాలు ఏపీలో కలుపొద్దని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని అసలు కేంద్రానికి పంపించారా లేదా?, ఇన్నేళ్లు ఎందుకు ఏడు మడలాల కోసం పోరాటం చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. అఖిల పక్షానికి ఎందుకు ఢిల్లీ తీసుకువెల్లలేదని కూడా ప్రశ్నించారు. కాపర్ డ్యాములు కడుతుంటే మీరెందుకు ఆపలేదన్నారు. ఏడు మండలాలు ఎలా వెనక్కి తెస్తారో చెప్పాలని, అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ 3వేల ఎకరాలు మునిగితే అంగీకరించ లేదన్నారు. మీరు 2లక్షలు ఎకరాలు మింగుతుంటే ఎలా అంగీ కరించారు? అని ప్రశ్నించారు. ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర మీద ఉన్న ప్రేమ మీకు తెలంగాణ మీద లేదా? అని ప్రశ్నించారు. పాలకులు ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేలా బాధ్యతారహితంగా మాట్లాడొద్దన్నారు. 

Updated Date - 2022-07-20T00:05:45+05:30 IST