కలిగోట్‌లో బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2021-10-17T06:18:27+05:30 IST

మండలంలోని కలిగోట్‌ గ్రామంలో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరా ల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కలిగోట్‌ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవి త బతుకమ్మ ఆడారు. ఎమ్మెల్సీ కవిత రాగానే మహిళలు గ్రూప్‌లుగా ఏర్ప డిన

కలిగోట్‌లో బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్సీ కవిత

జక్రాన్‌పల్లి, అక్టోబరు 16: మండలంలోని కలిగోట్‌ గ్రామంలో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరా ల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.  కలిగోట్‌ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవి త బతుకమ్మ ఆడారు. ఎమ్మెల్సీ కవిత రాగానే మహిళలు గ్రూప్‌లుగా ఏర్ప డిన ఎమ్మెల్సీ కవితతో కలిసి బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యం లో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నట్టు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కలిగోట్‌లో గ్రామ మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉంద న్నారు. ఎమ్మెల్సీ కవిత గ్రామ మహిళతో కలిసి బతుకమ్మ ఆడిన అనంత రం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దికొండ హరిత, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్‌, తనుజారెడ్డి, వైస్‌ ఎంపీపీ కుంచాల విమల, మండల టీఆర్‌ఎష్‌ అధ్యక్షుడు బోజన్న, స్థానిక సర్పంచ్‌ చేతనరెడ్డి, ఉపసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ జయ, టీఆర్‌ఎస్‌ నాయ కులు విజయ్‌రెడ్డి, గిరిధర్‌గౌడ్‌, వీడీసీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

సమస్యలు పరిష్కరించాలని విశ్వకర్మల వినతి

నిజామాబాద్‌ అర్బన్‌: తమ సమస్యలను పరిష్కరించాలని విశ్వకర్మ యజ్ఞం నగరంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన విశ్వకర్మలు ఎమ్మెల్సీ కవిత ను కలిసి శనివారం వినతిపత్రం అందించారు. విశ్వబ్రాహ్మణుల కమ్యూనిటిహాల్‌ కోసం ఐదు ఎకరాల భూమిని, రెండు కోట్ల రూపాయలను మంజూ రు చేయాలని ఆమెను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హన్మాండ్లు చారి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌చారి, ప్రచార కార్యదర్శి అమరవాది దశరత్‌, తాడూర్‌ పవన్‌కుమార్‌చారి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:18:27+05:30 IST