ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-15T05:38:38+05:30 IST

ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.

ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ
జిల్లాకేంద్రంలోని సద్దులచెరువు వద్ద కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

 విద్యుత శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి
 ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుక
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు 14 :
ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని విద్యుత్‌ శాఖ మంత్రి  జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని సద్దుల చెరువు వద్ద గు రువారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆయన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. సంస్కృతీ, సంప్రదాయాలకు తెలంగాణ పె ట్టింది పేరన్నారు. ప్రతి ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుం టలు నిండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి జగదీ్‌షరెడ్డి సద్దుల చెరువులో బతుకమ్మలను స్వయంగా వదిలారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, గుంటకండ్ల చంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవీ ఆనంద్‌, గండూరి కృపాకర్‌, చల్లా లక్ష్మికాంత్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని 22వ వార్డు రాజీవ్‌నగర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెనపహాడ్‌ మండల పరిఽధిలోని జల్మాల్‌కుంట తండాలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి జగదీ్‌షరెడ్డి రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన తండాకు చెందిన చిన్నారులు జ్యోతి, స్వాత్తిక్‌, మంచ్యా బాగోగులను తాను చూసుకుంటానని హామీనిచ్చారు. అనంతరం తండాలోని పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. జిల్లాకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాటి కిషన్‌ను మంత్రి జగదీ్‌షరెడ్డి పరామర్శించారు. ఆరోగ్య విషయాలు, కుటుంబసభ్యులను గురించి అడిగి తెలుసుకున్నారు.
 జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీ్‌షరెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్‌ఎస్‌ మహిళ కౌన్సిల ర్లు, నాయకురాళ్లతో కలిసి రంగురంగుల బతుకమ్మలు పేర్చారు. సాయంత్రం మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను రైతు బజార్‌ వద్ద గల సద్దుల చెరువు చౌరస్తాకు తీసుకొచ్చి ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ సద్దుల చెరువు ప్రాంత ంలో పోలీస్‌ బందోబస్తును పరిశీలించారు. బతుకమ్మ పండు గ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు జిల్లాకేంద్రంలోని 46వ వార్డులో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తుంగతుర్తి, మఠంపల్లి మండల పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలో, నేరేడుచర్ల పట్టణ, మండలంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్వపల్లి మండలంలో ని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మునగాల, నూతనకల్‌, మోతె, అనంతగిరి, మద్దిరాల మండలాల్లో సదు ్దల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారంలో సద్దుల సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుల్లితెర నటి నవ్యస్వామి, ఎమ్మెల్యే సైదిరెడ్డి మహిళలతో కలిసి  వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2021-10-15T05:38:38+05:30 IST