ముగిసిన బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2021-10-17T04:46:33+05:30 IST

ముగిసిన బతుకమ్మ సంబురాలు

ముగిసిన బతుకమ్మ సంబురాలు
అమెరికాలోని న్యూజెర్సీలో బతుకమ్మను నిమజ్జనం చేస్తున్నతాండూరుకు చెందిన ఆడపడుచులు

తాండూరు రూరల్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో వారం రోజులపాటు కొనసాగిన బతుకమ్మ వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సంగెంకలాన్‌లో ఎంపీపీ ఎస్‌.అనితారవీందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మలను వాగులో నిమజ్జనం చేశారు. కరన్‌కోట్‌లో సర్పంచ్‌ వీణా, ఉపసర్పంచ్‌ హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో, చెంగోల్‌ గ్రామంలో సర్పంచ్‌ మల్లీశ్వరి ఆధ్వర్యంలో, అదేవిధంగా అమెరికాలోని న్యూజెర్సీలో తాండూరు ఆడపడుచులు బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ఆడిపాడారు.

Updated Date - 2021-10-17T04:46:33+05:30 IST