‘వైసీపీ నాయకుల భూ కబ్జాను అడ్డుకోండి’

ABN , First Publish Date - 2021-08-03T04:53:39+05:30 IST

ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లెలో దాదాపు వందేళ్లుగా అక్కడి దేవాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ దేవాలయానికి చెందిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న ఈశ్వరమ్మ కుటుంబంపై దాడి చేసి ఆ పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ కోరారు.

‘వైసీపీ నాయకుల భూ కబ్జాను అడ్డుకోండి’
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న బీసీ సంఘాల నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 2: ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లెలో దాదాపు వందేళ్లుగా అక్కడి దేవాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ దేవాలయానికి చెందిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న ఈశ్వరమ్మ కుటుంబంపై దాడి చేసి ఆ పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ కోరారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ వద్ద నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రజా సంఘాల ప్రతినిధులు బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు.  నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ పార్లపల్లి సంఘటనలో పూజారి ఈశ్వరమ్మ కుటుంబానికి హై కోర్టు కూడా అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అడంగల్‌లో ఆ రైతు పేరు ఉందని, అయితే అధికార పార్టీలో ఉన్నామనే దీమాతో స్థానక వైసీపీ నాయకుడు తన చంద్రశేఖర్‌ రెడ్డి ఈశ్వరమ్మ భూములపై కన్ను వేసి దౌర్జన్యంగా భూమిని ఆక్రమించేందుకు  ప్రయత్నించాడని, ఇందులో భాగంగా బలహీనులైన పూజారి ఈశ్వరమ్మ కుటుంబంపై దాడి చేసి గాయపరిచారని అన్నారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంక్షేమ సంఘం రాయలసీమ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-03T04:53:39+05:30 IST