Advertisement

ఎమ్మెల్సీ స్థానం బీసీలకు కేటాయించాలి

Jan 24 2021 @ 21:35PM
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌

   బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ 

వనపర్తి టౌన్‌, జనవరి 24:  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో ఆదివారం బీసీల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు  ఎప్పుడు వచ్చిన జనాభాలో 52శాతం ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే అన్ని పార్టీలు వాడుకుంటున్నాయని విమర్శించారు.    గుంటి కురుమూర్తి, బాలరాజు నాయుడు, సాయికృష్ణగౌడ్‌, యు గంధర్‌, గోకం మధు, కార్తీక్‌      కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement