బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా

ABN , First Publish Date - 2021-12-20T03:01:44+05:30 IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి రాజీనామా చేశారు

బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీనామా

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సాల్వి మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. తన నోటీసు పిరియడ్ నవంబరు 30తోనే ముగిసిందని, అయినప్పటికీ న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముగిసేంత వరకు కొనసాగినట్టు చెప్పారు. 


బీసీసీఐలో కీలకంగా ఉన్న సాల్వే.. కరోనా సమయంలో ఎనలేని సేవలు అందించారు. బీసీసీఐతో తన పదేళ్ల ప్రయాణం అద్భుతంగా సాగిందన్నారు. కొంత భిన్నంగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కరోనా సమయంలో పనిచేయడం చాలెంజింగ్‌గా మారిందని అన్నారు. అయినప్పటికీ అన్ని టోర్నమెంట్లను కొనసాగించామని చెప్పుకొచ్చారు. ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందని సాల్వి పేర్కొన్నారు.  


సాల్వి బీసీసీఐ ఏజ్ వెరిఫికేషన్, యాంటీ డోపింగ్, మెడికల్ వింగ్‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కాగా, వచ్చే నెలలో జరగనున్న అండర్-16 బాయ్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌ (విజయ్ మర్చంచ్ ట్రోఫీ)కి ముందు సాల్వి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Updated Date - 2021-12-20T03:01:44+05:30 IST