షమిపై బీసీసీఐ పునరాలోచన

ABN , First Publish Date - 2022-08-14T08:57:59+05:30 IST

గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత పేసర్‌ మహ్మద్‌ షమి ఈ ఫార్మాట్‌లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు.

షమిపై బీసీసీఐ పునరాలోచన

టీ20 వరల్డ్‌క్‌పలో స్థానం లభించేనా?

న్యూఢిల్లీ: గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత పేసర్‌ మహ్మద్‌ షమి ఈ ఫార్మాట్‌లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు. యువ పేసర్లు హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లతోనే భారత జట్టు పొట్టి ఫార్మాట్‌లో సిరీ్‌సలు ఆడుతోంది. ఆసియా కప్‌ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. అయితే ప్రధాన పేసర్‌ బుమ్రాతో పాటు హర్షల్‌ పటేల్‌ గాయంతో బాధపడుతుండడంతో ఈ ఇద్దరిని ఆసియాక్‌పనకు ఎంపిక చేయలేదు.


అలాగే రానున్న వరల్డ్‌కప్‌లో వీరు ఆడేది సందేహంగానే మారింది. దీంతో బీసీసీఐ షమి ఎంపికపై పునరాలోచనలో పడింది. ఇద్దరు పేసర్లు గాయపడినా ఆసియాక్‌పలో షమిని తీసుకోకపోవడంపై ఇప్పటికే విమర్శలు వినిపించాయి. ‘షమి యువకుడేమీ కాదు. అందుకే అతడిపై ఎక్కువ భారం పడకుండా ఉండేందుకే టీ20లకు దూరంగా ఉంచుతున్నాం. ఈ విషయం అతడికి కూడా తెలుసు. ఒకవేళ ఇద్దరు ముఖ్య పేసర్లు దూరమైతే ఆసీ్‌సలో జట్టు ఆధారపడదగ్గ బౌలర్‌ అవసరం ఉంటుంది. మిగతావారికన్నా షమికి అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. ఈమేరకు కచ్చితంగా అతడు జట్టుకు బలం కానున్నాడు. అయితే ఆసియాకప్‌ తర్వాతే షమి ఎంపిక విషయంపై స్పష్టత వస్తుంది’ అని బోర్డు అధికారి తెలిపాడు. 

Updated Date - 2022-08-14T08:57:59+05:30 IST