Be Alert : తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-10-17T14:20:52+05:30 IST

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని..

Be Alert : తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్ సిటీ : తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లోని ఒక్కటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా శనివారం నాడు ఉరుములు, మెరుపులతో భాగ్యనగరంలో భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 27న మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలుస్తోంది. ఒడిశా పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.


ఇదిలా ఉంటే.. కేరళలో వర్షం బీభత్సం సృష్టించింది. వరదల ధాటికి కొట్టాయం, ఇడుక్కిలలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. దీంతో 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలతో రెండ్రోజుల పాటు శబరిమల దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-17T14:20:52+05:30 IST