జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-24T04:54:54+05:30 IST

భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకో వాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.

జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ
గొండ్యాల వాగును పరిశీలిస్తున్న ఎస్పీ వెంకటేశ్వర్లు

హన్వాడ, జూలై 23: భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకో వాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని గొండ్యాల వాగు బ్రిడ్జి వద్ద నీటిని ఎస్పీ శుక్రవారం పరిశీలించారు. గతంలో జరిగిన సంఘటనను గుర్తించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలను దూరంగా ఉంచాలని చెప్పారు. యువత పోలీసులు, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలన్నారు. ఆయన వెంట సీఐ మహేశ్వర్‌, ఎస్‌ఐ సతీష్‌, ప్రొబెషనరీ ఎస్‌ఐ మాధవి పాల్గొన్నారు.

గండీడ్‌: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. మండలంలోని పగిడ్యాలలో పురాతన ఇళ్లలో నివాసం ఉంటున్న వారితో మాట్లాడారు. సల్కర్‌పేటకు చెందిన మాధవి ఎస్‌ఐ ఉద్యోగం సాధించడంతో ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అభినందించారు. రంగారెడ్డిపల్లి వాగు బ్రిడ్జిను పరిశీలించారు. మండల కేద్రంలో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీధర్‌, సీఐ మహేశ్వర్‌, ఎస్‌ఐ రాముడు ఉన్నారు.

మిడ్జిల్‌: రాబోయే రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో వాగులు, వంకలు నీటి ప్రదేశాల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిడ్జిల్‌ ఎస్‌ఐ జయప్రసాద్‌ తెలిపారు. మండలంలోని వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, మున్ననూర్‌, కొత్తూర్‌, భైరంపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో గల వాగులను ఎస్‌ఐ సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. కొత్తూర్‌ శివారులో దుందుభీ వాగుపై నిండిన చెక్‌డ్యాంను పరిశీలించారు. ఎస్‌ఐ వెంట సిబ్బంది రామస్వామిగౌడ్‌, శ్రీనివాస్‌, రైతులు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-07-24T04:54:54+05:30 IST