‘వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-03-03T06:33:51+05:30 IST

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జేకేఆర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందాచారి కోరారు.

‘వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’
పలకలు, నోటుపుస్తకాల పంపిణీ చేస్తున్న బ్రహ్మానందాచారి

బనగానపల్లె  మార్చి 2: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జేకేఆర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందాచారి కోరారు. మంగళవారం మండలంలోని పలుకూరులో శ్రీవెంకటేశ్వర భక్తమండలి సహకారంతో డిపెప్‌,  ఉర్దూ పాఠశాల విద్యార్థులకు డాక్టర్‌ హనుమంతు ఆర్థిక సాయంతో ఉచితంగా పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హనుమంతు, బ్రహ్మానందాచారి వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో  డిపెప్‌ పాఠశాల హెచ్‌.ఎం రహీం, ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం. రహీమ్‌, ఉపాధ్యాయులు వెంకటరమణ, అంగన్‌వాడీ టీచర్లు శ్రీదేవి, సుకన్య, బాలహనుమంతు, బాకన్న, దస్తగిరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T06:33:51+05:30 IST