ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త..!

ABN , First Publish Date - 2022-01-25T19:55:17+05:30 IST

కొవిడ్‌ లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే, అంత త్వరగా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకోగలం. అయితే దగ్గు, జలుబు, జ్వరం లాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలే

ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త..!

ఆంధ్రజ్యోతి(25-01-2022)

కొవిడ్‌ లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే, అంత త్వరగా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకోగలం. అయితే దగ్గు, జలుబు, జ్వరం లాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలే కాకుండా చర్మసంబంధ లక్షణాల ద్వారా కొవిడ్‌ బయల్పడే వీలుంది. కాబట్టి ఆ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి.


కొవిడ్‌ డిజిట్స్‌: కాలి వేళ్ల చివర్లలో ఎర్రని వాపులు కనిపిస్తాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాటిని కొవిడ్‌ డిజిట్స్‌గా సంభోదిస్తూ ఉంటారు. ‘చిబ్లేన్స్‌’ అని వైద్య పరిభాషలో పిలుచుకునే ఈ వాపులు ఎలాంటి దురదనూ కలిగించవు. కొన్ని రోజులకు వాటి పై చర్మం ఊడిపోయి, లోపల పొట్టుతో కూడిన చర్మం బహిర్గతం అవుతుంది. 


ఎగ్జీమా: ఎర్రగా కందిపోయి, పగుళ్లుబారే చర్మ లక్షణం ఎగ్జీమా. దురదతో కూడిన ఎగ్జీమా ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన సమయంలో లేదా తగ్గిన తర్వాత కొన్ని రోజుల పాటు వేధిస్తుంది. ఎండ సోకే వీలున్న మెడ, చేతుల మీద ఎగ్జీమా రూపంలో కూడా కొందర్లో కొవిడ్‌ బయల్పడుతోంది. 


దద్దుర్లు: ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు, శరీరం మీద ఎర్రని, దురదతో కూడిన దద్దుర్లు తలెత్తడం సహజం. ముఖం, వెన్ను, తొడల మీద దద్దుర్లు తలెత్తి విడవకుండా వేధిస్తుంటే కొవిడ్‌గా అనుమానించవచ్చు.

Updated Date - 2022-01-25T19:55:17+05:30 IST