చాణక్య నీతి: ఈ మూడు రకాల వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే తరువాత బాధపడతారు!

ABN , First Publish Date - 2022-01-13T11:56:20+05:30 IST

ఆచార్య చాణక్య తన విషయ పరిజ్ఞానం..

చాణక్య నీతి: ఈ మూడు రకాల వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే తరువాత బాధపడతారు!

ఆచార్య చాణక్య తన విషయ పరిజ్ఞానం, అనుభవం ద్వారా తెలుసుకున్నది..అర్థం చేసుకున్నది.. తన చాణక్య నీతిలో పొందుపరిచారు. చాణక్య నీతి అనేది మనిషి విజయానికి ప్రేరణ కల్పిస్తుంది. ఈ కారణంగానే నేటికీ చాలామంది చాణక్య నీతిని అధ్యయనం చేసి, తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

చాణక్య నీతి ప్రకారం తన చుట్టూ ఉన్న వ్యక్తుల నైజాన్ని గుర్తించే సామర్థ్యం లేని వ్యక్తి అవస్థల పాలవుతాడు. మన చుట్టూ ఉండే మూడు రకాల వ్యక్తుల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


స్వార్థపరులు

చాణక్య నీతి ప్రకారం స్వార్థపరుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్త వహించాలి. అలాంటి వ్యక్తులు నిరంతరం తమ లాభం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. స్వార్థపరుడు తన ప్రయోజనాలు తప్ప ఇతరుల ప్రయోజనాలను పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని విశ్వసించకూడదు. వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎవరినైనా మోసం చేయగలడు. అవకాశం వచ్చినప్పుడు తన ప్రయోజనం గురించి ఆలోచిస్తాడు.

కోపిష్టులు

చాణక్య నీతి ప్రకారం, కోపం ఎక్కువగా ఉన్నవ్యక్తికి, ఆయుధాలను కలిగి ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. అలాంటి వ్యక్తులు కోపంతో మీకు హాని కలిగించే పనిని చేయవచ్చు. ఫలితంగా మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

అతిగా పొగిడేవారు

చాణక్య నీతి ప్రకారం ముఖం ఎదుట పొగిడే వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారు నిరంతరం తమ స్వలాభం గురించే ఆలోచిస్తారు. చాణక్య నీతి ప్రకారం ముఖం ఎదుట పొగిడే వ్యక్తి మన వెనుక చెడు చేసే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి వారిని అస్సలు నమ్మకూడదు. అలాంటి వారిని ఎప్పుడూ శ్రేయోభిలాషులుగా పరిగణించకూడదని ఆచార్య చాణక్య హెచ్చరించారు. 

Updated Date - 2022-01-13T11:56:20+05:30 IST