దేశభక్తిని చాటండి!

ABN , First Publish Date - 2022-08-13T06:07:02+05:30 IST

దేశభక్తిని చాటండి!

దేశభక్తిని చాటండి!
చేతిలో జాతీయ జెండాతో వృక్షాసనం వేసిన విద్యార్థులు

 నేడు, రేపు, ఎల్లుండి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. ప్రజలకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు పిలుపు

అజిత్‌సింగ్‌నగర్‌/కలెక్టరేట్‌, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని శని, ఆది, సోమ వారాల్లో ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. దిల్లీరావు ప్రజలకు పిలు పునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాకు లక్షా 80 వేలు, నగర కార్పొరేషన్‌ పరిధిలో 60 వేల జాతీయ జెం డాలను సరఫరా చేశామని తెలిపారు. వ్యా పారులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛం దంగా జెండాలను సమకూర్చుకుని ఆవిష్కరించా లని సూచించారు. 

సైనికుల త్యాగాలు అద్వితీయం

దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషి, త్యాగాలు అద్వితీయమని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీ రావు కొనియాడారు. ఆజాదీ కా అమృత్‌ మ హోత్సవ్‌లో భాగంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సైనికులు ర్యాలీ నిర్వ హించి, కలెక్టర్‌ కార్యాలయంలో ఆయ నకు జాతీయ పతాకాన్ని జ్ఞాపికగా  అంద జేశా రు. డీఆర్వో కె.మోహన్‌కుమార్‌, సైనిక సం క్షేమ అధికారి వి.వెంకటరెడ్డి, ఫ్లైట్‌ లెఫ్టినెం ట్‌ ఎం.బాలాజీ, మాజీ సైనికులు, జిల్లా సై నిక సంక్షేమ శాఖ సభ్యులు, సిబ్బంది పాల్గొ న్నారు.

నేడు 15 వేల మందితో ‘హర్‌ ఘర్‌ తిరంగా’

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం మహాత్మా గాంధీ రోడ్డులో విద్యార్థులు, ప్రజలు 15 వేల మందితో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  3.50 కిలోమీటర్ల పొడవు త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. బెంజ్‌ సర్కిల్‌లోని ట్రెండ్‌సెట్‌ మాల్‌, లబ్బీ పేటలోని పీవీపీ మాల్‌, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌, కంట్రోల్‌ రూమ్‌ సమీ పంలో వేదికలను ఏర్పాటు చేశామని, ఉదయం 8 గంటల నుంచి, నాలుగు వేదికలపై విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు పీవీపీ మాల్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి సందేశాలు ఇస్తారని కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్‌ ఘర్‌ తిరంగా కార్య్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




జాతీయ భావం పెంపొందించుకోవాలి

మచిలీపట్నం టౌన్‌: విద్యార్థులు జాతీయ భావం పెంపొందించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ రావిరాల మహేష్‌కుమార్‌ సూచించారు. ఆజాదీగా అమృతోత్సవ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ యోగ సభ ఆధ్వర్యంలో మునిసిపల్‌ ప్రధాన పార్కులో మూడు వేల మంది విద్యార్థులు జాతీయజెండా పట్టుకుని వృక్షాసనం వేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ యోగ ప్రదర్శన ఇండియన్‌ యూనిక్‌ బుక్‌ అవార్డుకు అర్హత సాధించింది. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సిలార్‌ దాదా, డీఈవో తాహరా సుల్తానా, ఆర్డీవో  కిషోర్‌, తహసీల్దార్‌ సునీల్‌ బాబు, బెరాకా మినిస్ట్రీస్‌ అఽధినేత కిరణ్‌ పాల్‌, డీవైఈవో యువి సుబ్బారావు, ఎంఈవో దుర్గాప్రసాద్‌, కమిషనర్‌ జి.చంద్రయ్య, డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం, యోగ గురువులు గురునాథబాబు, చింతయ్య, ఆర్డీ ప్రసాద్‌, చిలంకుర్తి శేషు, ఝాన్సీ, క్రాంత్‌కార్‌ పాల్గొన్నారు. జాతీయ నాయకుల చిత్రపటాలతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో రేవతీ సెంటర్‌ నుంచి కోనేరుసెంటర్‌ వరకు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. డీఈవో తాహెరా సుల్తానా ర్యాలీని ప్రారంభించారు. సంఘ నాయకులు సుందరరాం తదితరులు ర్యాలీకి నాయకత్వం వహించారు. డీవైఈవో యు.వి.సుబ్బారావు, ఎంఈవో ప్రసాద్‌ పాల్గొన్నారు.   




Updated Date - 2022-08-13T06:07:02+05:30 IST