ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

Jul 30 2021 @ 01:07AM
సిరిసిల్ల రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ రాహూల్‌హెగ్డే

ఎస్పీ రాహూల్‌హెగ్డే 

సిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి జూలై 29: పోలీస్‌ స్టేష న్‌కు వచ్చే పిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించా లని  ఎస్పీ రాహూల్‌హెగ్డే సూచించారు. సిరిసిల్ల ప ట్టణంలోని రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం, తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌లను ఎస్పీ రాహూల్‌హెగ్డే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని రికార్డులు, పెండింగ్‌ కేసులు, సి బ్బంది వివరాలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర నియం త్రణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. క్రిమినల్‌ గ్యాం గ్‌లపై నిఘా పెట్టాలని, ఫిర్యాదుదారులతో మర్యాద గా మెలగాలన్నారు. 

పోలీస్‌ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని క మ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాల ఏ ర్పాటులో ప్రజలు భాగస్వామ్యం చేయాలని సూచిం చారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రశేఖర్‌, రూరల్‌ సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐలు లక్ష్మారెడ్డి, రఫీక్‌ఖాన్‌, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

Follow Us on: