థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-21T05:10:02+05:30 IST

కరోనా మూ డో దశను ఎదుర్కోవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు.

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
అనవసరంగా ఆస్పత్రిలో తిరగొద్దని రోగి సహాయకులను హెచ్చరిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

- జిల్లా ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

- నిబంధనలు పాటించాలని రోగులకు సూచన

- ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం


వనపర్తి వైద్యవిభాగం, జనవరి 20 : కరోనా మూ డో దశను ఎదుర్కోవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రిని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతేనే ఆస్పత్రికి రావాలని రోగులకు సూచించారు. విచ్చలవిడిగా ఆస్పత్రిలో ఇతరులు ఉండటాన్ని చూసి సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని సూపర్‌వైజర్‌పై ఆగ్ర హం వ్యక్తం చేశారు. రోగి తప్ప ఇతరులు ఆస్పత్రి లోకి రాకుండా చూసుకోవాలని వైద్యులను ఆదేశిం చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పండుగ తర్వాత పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగు తున్నాయని, ప్రతీ ఒక్కరూ జాగ్రతలు పాటించా లన్నారు. అవసరమైతేనే బయటికి రావాలని, అనవ సరంగా రోడ్లపైకి రావొద్దని సూచించారు. కలెక్టర్‌ వెం ట అదనపు కలెక్టర్‌(లోకల్‌ బాడీ) ఆశీష్‌ సంగ్వాన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందునాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ రవిశంకర్‌, జిల్లా ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ రాజ్‌కుమార్‌, మునిసిపల్‌ కమిష నర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ చైతన్యగౌడ్‌, వైద్య సిబ్బంది ఉన్నారు. 

 వారంలోపు ఇంటింటి సర్వే 

వనపర్తి అర్బన్‌ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు ఈనెలలో వారంలోపు కొవిడ్‌ నియంత్రణఫై ఇంటింటి సర్వే పూర్తిచేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో ఆమె వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మునిసిపాలిటీ శాఖల సమన్వయంతో ఇం టింటి సర్వే (జ్వరం, దగ్గు) నిర్వహించి, వారంలోపు సర్వే పూర్తి  చేయాలని సూచించారు.  జిల్లాలో 1లక్ష 33వేల 396 కుటుంబాలు ఉన్నాయని, టీమ్‌లను ఏర్పాటుచేసి వారి ద్వారా రోజువారి రిపోర్టులను అందించాలని ఆమె తెలిపారు. కొవిడ్‌ కిట్లను అం దుబాటులో ఉంచాలని, ప్రతిరోజు సాయంత్రం 5గం టల లోపు రిపోర్టులు పంపే విధంగా చర్యలు చేప ట్టాలని, ప్రతీ ఒక్కరికి రెండు డోసులు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 15 నుంచి 17 సంవత్సరాల వారికి 86 శాతం వ్యాక్సి నేషన్‌ పూర్తి చేశామని, రెండో డోసు 67 శాతం పూ ర్తి వచ్చినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అద నపు కలెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-21T05:10:02+05:30 IST