ఆరోగ్యకరమైన స్టఫ్‌ ఉండలు

ABN , First Publish Date - 2022-09-24T05:54:27+05:30 IST

చైనా ఫుడ్‌ అంటే నూడిల్స్‌, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌లూ, సూప్‌లే కాదు..

ఆరోగ్యకరమైన స్టఫ్‌ ఉండలు

చైనా ఫుడ్‌ అంటే నూడిల్స్‌, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌లూ, సూప్‌లే కాదు.. స్టఫ్‌ కూరిన ఉండలను స్టీమ్‌ చేసి తినే డంప్లింగ్స్‌ కూడా. స్టఫ్‌ నిండిన ఈ ఉండలను సులువుగా చేసుకుని సాస్‌లతో ఎంచక్కా తినేయొచ్చు. వీకెండ్‌ వేళలో ఈ ఉండలను చేసుకుని మనసంతా సరికొత్త స్టఫ్‌ను నింపేసుకోండి.. 


త్రీ లంగ్‌ హర్‌ గో

కావాల్సిన పదార్థాలు

రొయ్యలు-150 గ్రాములు (తరిగినవి), చారొకోల్‌ పౌడర్‌- రంగుకి, బాంబూషూట్‌- 10 గ్రాములు, హర్‌ గో డఫ్‌- 10 గ్రాములు, నువ్వుల నూనె- 5 ఎమ్‌.ఎల్‌, వెన్న- 5 గ్రాములు, బంగాళదుంప స్టార్చ్‌-100 గ్రాములు

తయారీ విధానం

బంగాళాదుంప స్టార్చ్‌కి తగినన్ని వేడినీళ్లు పోసి ముద్దగా చేయాలి. దాన్ని చిన్న ఉండలుగా కట్‌ చేయాలి. ప్రతి ఉండను చేత్తో తీసుకుని చపాతీలా ఒత్తుతూ దాని మీద స్టఫ్‌కోసం రొయ్యలు, చార్‌కోల్‌ పౌడర్‌, బాంబూషూట్‌తో పాటు వేలితో కాస్త నువ్వుల నూనె అద్దాలి. దానిమీద కొంచెం వెన్న ఉంచి.. చుట్టూ జాగ్రత్తగా క్లోజ్‌ చేస్తూ ఉండగా చేసుకోవాలి. వీటిని స్టీమ్‌ చేసి బ్లాక్‌ పెప్పర్‌ చల్లుకుని, చిల్లీ సాస్‌తో తినాలి.


వెజిటబుల్‌ క్రిస్టల్‌ డంప్లింగ్స్‌ 

కావాల్సిన పదార్థాలు

పొటాటో స్టార్చ్‌- 100 గ్రాములు, వాటర్‌ చెస్ట్‌నట్‌- 50 గ్రాములు(తరిగిన), ఆస్పరాగస్‌- 35 గ్రాములు(తరిగిన), క్యారెట్‌ తురుము- 35 గ్రాములు, సన్నటి ముక్కలుగా తరిగిన అల్లం- 5 గ్రాములు, మిరపకాయలు- 3 గ్రాములు (తరిగిన)

తయారీ విధానం

తొలుత వంద గ్రాముల బంగాళ దుంప స్టార్చ్‌ను వేడి నీళ్లతో కలిపి ముద్దగా చేయాలి. తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను చేత్తో మెత్తగా చపాతిలాగా ఒత్తాలి. అందులోకి స్టఫ్‌గా వాటర్‌ చెస్ట్‌ నట్‌, ఆస్పరాగస్‌, క్యారెట్‌ను ఉంచాలి. 

మెల్లగా చుట్టూ ఉండలాగా పిండిముద్దను జాగ్రత్తగా ఒత్తుతూ గుండ్రంగా చేసుకోవాలి. దీన్ని స్టీమ్‌ చేయాలి. వెజిటబుల్‌ క్రిస్టల్‌ డంప్లింగ్స్‌ రెడీ. వీటిని బ్లాక్‌ పెప్పర్‌ లేదా చిల్లీ సాస్‌తో తినేయాలి.


జింజర్‌ చికెన్‌ జియోజీ డంప్లింగ్స్‌

కావాల్సిన పదార్థాలు

చికెన్‌ లెగ్‌ పీస్‌ బోన్‌లెస్‌- 120 గ్రాములు, ఉల్లిపాయలు- 10 గ్రాములు, స్ర్పింగ్‌ ఆనియన్స్‌- 5గ్రాములు, ఓయిస్టర్‌ సాస్‌-10 గ్రాములు, డార్క్‌ సోయా- 2 గ్రాములు, లైట్‌ సోయా- 2 గ్రాములు, పచ్చిమిర్చి పేస్ట్‌- 5 గ్రాములు, నువ్వుల నూనె- టీ స్పూన్‌, బీట్‌ రూట్‌- 5 గ్రాములు, పొటాటో స్ర్టాచ్‌- 100 గ్రాములు, దంచిన అల్లం- టీస్పూన్‌

తయారీ విధానం

బంగాళదుంప స్ర్టాచ్‌కు కాస్త వేడినీళ్లు పోసి మెత్తని ముద్దగా చేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకుని మూడు ఇంచుల పరిమాణంలో చేతిమీద చపాతీలా ఒత్తుకోవాలి. దానిమీద కొంచెం కొంచెం చికెన్‌, ఆనియన్‌, స్ర్పింగ్‌ ఆనియన్‌, చిల్లీ పేస్ట్‌, బీట్‌రూట్‌, సోయా సాస్‌లు, అల్లంను స్టఫ్‌గా ఉంచి చుట్టూ లడ్డులా మెల్లగా ఒత్తుకోవాలి. అలా అన్ని ఉండలలో స్టఫ్‌ను కూరి గుండ్రంగా ఒత్తుకోవాలి. నువ్వుల నూనెలో వేలు ముంచి ఒక్కో దానిమీద చుట్టూ పూయాలి. ఆ తర్వాత అన్నింటిని స్టీమ్‌ చేయాలి. దీన్ని బ్లాక్‌ పెప్పర్‌, చిల్లీ సాస్‌తో తినాలి. 


సిల్‌కెన్‌ తోఫు ఎడ్‌మామె

కావాల్సిన పదార్థాలు

ఎడమామే బీన్స్‌ పేస్ట్‌- 150 గ్రాములు, బంగాళదుంప ఫ్లేక్స్‌- 10 గ్రాములు, అమూల్‌ ఫ్రెష్‌ క్రీమ్‌- 10 గ్రాములు, సాల్ట్‌ అండ్‌ షుగర్‌- రుచికి తగినంత, సిన్‌కెన్‌ తోఫు- 150 గ్రాములు, నువ్వుల నూనె- 5 ఎమ్‌.ఎల్‌, బంగాళదుంప స్టార్చ్‌- 100 గ్రాములు, ఉల్లిపాయలు-10 గ్రాములు

 తయారీ విధానం

బంగాళాదుంప స్టార్చ్‌ను వేడినీళ్లు పోసి మెత్తటి ముద్దగా చేసుకోవాలి. దాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను చేతిమీద చపాతీలా చేసి దానికి నువ్వుల నూనెలో వేలిని ముంచి అద్దాలి. స్టఫ్‌కు సిల్‌కెన్‌ తోఫు, పొటాటో ఫ్లేక్స్‌, ఎడమామే బీన్స్‌ పేస్ట్‌, అమూల్‌ క్రీమ్‌, ఉల్లిపాయలు, సాల్డ్‌ అండ్‌ షుగర్‌ను వేసి జాగ్రత్తగా అన్ని వైపులా క్లోజ్‌ చేసుకుంటూ లడ్డూలా ఒత్తుకోవాలి. వీటిని స్టీమ్‌ చేసి బ్లాక్‌పెప్పర్‌తో తింటే సరి.

Updated Date - 2022-09-24T05:54:27+05:30 IST