సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Jun 15 2021 @ 00:47AM
పెద్దచింతకుంట పశువైద్యశాలలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా పశువైద్యాధికారి

జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వెంకటయ్య

 నర్సాపూర్‌, జూన్‌ 14: పశువులకు సీజనల్‌ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెద్దచింతకుంట పశువైద్యశాలను జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తొలకరి వర్షాలకు పచ్చి మేత మేసి, వర్షపునీరు తాగిన పశువులు  అనారోగ్యానికి  గురవుతాయన్నారు. ఆ సమయంలో వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.  

  

Follow Us on: