సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-06-25T05:43:23+05:30 IST

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని ప్రాథమిక, కమ్యునిటీ, పల్లె దవాఖానాల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి కోరారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న మాలతి

 డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి

ఖమ్మంకలెక్టరేట్‌, జూన్‌24: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అన్ని ప్రాథమిక, కమ్యునిటీ, పల్లె దవాఖానాల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది అన్ని ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు.  గ్రామాల్లో డ్రైడే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా మెదడువాపు వ్యాధి పైలేరియా, రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అసంక్రమణ వ్యాధి గ్రస్తుల గుర్తింపు పరీక్షలు చికిత్సలు నిర్వహించి ప్రతి కేసుకు సరైన క్రమంలో మందులు పంపిణీ చేయా లన్నారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను అన్ని ఎప్పటి కప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు.  వ్యాక్సిన్‌లు వ్యాధినిరోధక టీకాలు కోవిడ్‌ టీకాలు కుక్కకాటు రేబిస్‌ వ్యాక్సిన్‌ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిల్వలు ఉన్నాయన్నారు. కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండా లన్నారు.  ఈ సమీక్షలో డీటీసీవో డాక్టర్‌ వి సుబ్బారావు, పీవో డాక్టర్‌ ప్రవీణ, ఎంసీహెచ్‌ పీవో డాక్టర్‌ సైదులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాంబాబు, ఎన్‌సీబీ డాక్టర్‌ కోటిరత్నం, పీవో డాక్టర్‌ ప్రమీల, డీటీటీ డాక్టర్‌ మోత్యా, డీప్యూటీ డీఈఎంవో  జి సాంబశివరెడ్డి, ఎస్‌డీపీవో నీలోహన, డీఎంవో సంధ్య  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:43:23+05:30 IST