మరోసారి వణికిస్తున్న జోకర్.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచన

ABN , First Publish Date - 2021-06-17T16:09:20+05:30 IST

మరోసారి జోకర్ వణికిస్తోంది. జోకర్ మాల్ వేర్ బాధితుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు దేశాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

మరోసారి వణికిస్తున్న జోకర్.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచన

హైదరాబాద్: మరోసారి జోకర్ వణికిస్తోంది. జోకర్ మాల్ వేర్ బాధితుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు దేశాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అపరిచిత సైట్లు, లింకులు, యాడ్ల జోలికి పోవద్దని సూచించారు. ఒకసారి మాల్ వేర్ ఎంటరైందంటే దాన్ని గుర్తించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 41 యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించారు. 2017లో తొలిసారి దీని ఉనికిని గూగుల్ ప్లే స్టోర్ గుర్తించింది. డిలీట్ చేసినా మారు పేర్లతో మళ్లీ మాల్ వేర్ జోకర్ ఎంటర్ అవుతూనే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలోకి ఎంటర్ అయితే ఇక అంతే సంగతులు. మాల్ వేర్ ఎంటర్ అయితే వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి మనకు తెలియకుండానే వెళ్లిపోతుంది. మన ఖాతా, ఫోటోలు, డేటా, వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల చేతుల్లోకే వెళ్లిపోతుంది. మహారాష్ట్రలో దీని బాధితులు అనేక మంది ఉన్నారు. అపరిచిత సైట్ల జోలికి వెళ్లొద్దని యువతకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లింకులు, యాడ్స్ పట్ల జాగ్రత్త వహించాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

Updated Date - 2021-06-17T16:09:20+05:30 IST