ఉప్పాడ బీచ్‌రోడ్డులో దూసుకొస్తున్న కెరటాలు

ABN , First Publish Date - 2022-08-12T07:19:26+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడణ ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్రకెరటాలు బీచ్‌రోడ్డుపైకి దూసుకొస్తున్నాయి. గురువారం తెల్లవారుజామునుంచి సముద్రం కల్లోలంగా మారింది. కెరటాలు క్రాస్‌(అడ్డదిడ్డం)గా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలకు కాలువ ద్వారా సముద్రానికి వరద నీరు పోటెత్తుతోంది.

ఉప్పాడ బీచ్‌రోడ్డులో దూసుకొస్తున్న కెరటాలు
ఉప్పాడలో బీచ్‌రోడ్డును తాకుతున్న కెరటాలు

  • భయాందోళనలో ప్రయాణికులు

ఉప్పాడ(కొత్తపల్లి) ఆగస్టు 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడణ ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్రకెరటాలు బీచ్‌రోడ్డుపైకి దూసుకొస్తున్నాయి. గురువారం తెల్లవారుజామునుంచి సముద్రం కల్లోలంగా మారింది. కెరటాలు క్రాస్‌(అడ్డదిడ్డం)గా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలకు కాలువ ద్వారా సముద్రానికి వరద నీరు పోటెత్తుతోంది. పౌర్ణమి కూడా కావడంతో కెరటాలు మరింత ఉధృతంగా ఉరకలేస్తూ బీచ్‌రోడ్డును తాకుతూ, ఆ దారిన ప్రయాణించే వాహనాలపైకి దూసుకుపోతున్నాయి. కెరటాల వేగానికి చిన్న, చిన్న గులక రాళ్లు బీచ్‌రోడ్డుపైకి వెదజల్లుతున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మాయాపట్నం, సూరాడపేట, కొత్తపట్నం, కోనపాపపేట తదితర తీరప్రాంతాల గ్రామాల్లో మత్స్యకారుల ఇళ్లల్లోకి సముద్రపు నీరు చేరుతోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  సముద్రంలో కెరటాలు అడ్డదిడ్డంగా ఎగసిపడుతున్నాయి. తుఫాన్‌లు, అల్పపీడనాలు ఏర్పడే సందర్భాల్లో కెరటాలు ఇలా జరుగుతుందని, దీంతో సముద్రంలో వాతావరణం బాగోలేదని గుర్తిస్తామని మత్స్యకార పెద్దలు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-12T07:19:26+05:30 IST